కళ తప్పిన గుగూల్ హోమ్ పేజ్?

Posted By: Prashanth

కళ తప్పిన గుగూల్ హోమ్ పేజ్?

 

జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. అయితే గుగూల్ హోమ్ పేజ్ మాత్రం సర్వసాధారణంగా దర్శనమివ్వటం పలువురిని ఆశ్చర్యానికి లోనుచేసింది. సెర్చ్ ఇంజన్ గుగూల్ గత కొంత కాలంగా విశిష్టత కలిగిన రోజుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ హోమ్ పేజీ పై ఆ స్మృతులతో కూడిన డూడుల్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ప్రతి అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే గుగూల్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని విస్మరించటం పర్యావరణ ప్రేమికులను విస్మయానికి లోనుచేస్తుంది. మే1న నిర్వహించే ‘లేబర్ డే’ను సైతం గుగూల్ విస్మరించింది.

జీమెయిల్ యూజర్లకు వెరీ వెరీ స్పెషల్:

విదేశీ భాషల్లో వచ్చిన ఈ మెయిళ్లను తమ సొంత భాషల్లోకి అనువాదం చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని జీ మెయిల్ తెలిపింది. త్వరలో కొత్తగా జీ మెయిల్‌లో ట్రాన్స్‌లేట్ మెసేజ్ హెడర్‌ను అందిస్తామని, ఈ సౌలభ్యంతో మెయిళ్లను సొంత భాషలోకి అనువాదం చేసుకోవచ్చని గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రోడక్ట్ మేనేజర్ జెఫ్ చిన్ చెప్పారు. ఆహ్వాన ప్రాతిపదికన, గుగూల్ జీమెయిల్ సర్వీసులను ప్రపంచవ్యాప్తంగా ఎప్రిల్ 1, 2004న ప్రారంభించింది. ఈ ఎనిమిదేళ్ల కాల వ్యవధిలో జీమెయిల్ తన స్టోరేజ్ శాతాన్ని 1జీబి నుంచి 7.5జీబి వరకు క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. తాజాగా ఈ స్టోరేజ్ శాతాన్ని మరో 2.5జీబికి పొడిగిస్తూ, జీమెయిల్ టీమ్ ఓ ప్రకటనను జారీ చేసింది. అంటే జీమెయిల్‌లో లభ్యమయ్యే ఉచిత స్టోరేజ్ శాతం 10జీబి అన్నమాట. ఈ ఉచిత స్టోరేజ్ వెసలుబాటు జీమెయిల్ యూజర్లందరికి వర్తిస్తుంది.

గుగూల్ డ్రైవ్:

గుగూల్ ఇటీవలే గుగూల్ డ్రైవ్ పేరిట క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ను ప్రారంభించింది. పెయిడ్ ఖాతా ద్వారా గుగూల్ డ్రైవ్ సర్వీసులను వినియోగించుకునే వారు 25జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా పొందవచ్చు. గుగూల్ డ్రైవ్ పెయిడ్ ఆకౌంట్ల ద్వారా 25జీబి నుంచి 1 ట్యాబ్ వరకు స్టోరేజ్ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు. స్టోరేజి వాడుకకు సంబంధించి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot