Home
News

యూజర్లకి గుడ్ న్యూస్, మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన పని లేదు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. బ్యాంకు అకౌంట్‌లలో ప్రతి నెల కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇప్పటి వరకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత అకౌంట్‌దారులు తమ ఖాతాల్లో కచ్చితంగా కనీస నగదు నిల్వ ఉండేలా చూసుకోవాలి. మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి, బ్యాంకును బట్టి రూ.500 నుంచి రూ.10,000 వరకు ఉంది.

యూజర్లకి గుడ్ న్యూస్, మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయాల్సిన పని లేదు

ప్రభుత్వ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, ప్రయివేటు బ్యాంకుల్లో మాత్రం ఎక్కువగా ఉండాలి. లేదంటే పెనాల్టీ ఉంటుంది. దీంతో పాటు బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్‌బుక్‌తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఇప్పుడు ఆర్బీఐ కల్పించింది.

మినిమం బ్యాలెన్స్ నిబంధనకు నో

మినిమం బ్యాలెన్స్ నిబంధనకు నో

నెలలో 4సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన ఉండకూడదని ఆర్బీఐ పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్ అకౌంట్స్‌గా పిలిచే ఖాతాల్లో కనీస నగదు నిల్వ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఇక వీరికి మినిమం బ్యాలెన్స్ లేకుండానే

ఇక వీరికి మినిమం బ్యాలెన్స్ లేకుండానే

వివిధ రకాల సేవలు బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎలాంటి మినిమం బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకోవచ్చు. చెక్ బుక్‌తో పాటు ఇతర సదుపాయాలు అడిగితే బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ చూపించాలని అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌బీడీఏను (Basic Savings Bank Deposit Accoun-BSBDA) సేవింగ్స్ ఖాతాగా కొన్ని రకాల సదుపాయాలు ఎలాంటి ఛార్జీలు లేకుండానే అందించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.

 ఈ సేవలు పొందవచ్చు

ఈ సేవలు పొందవచ్చు

ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కనీస సదుపాయాలకు అదనంగా బ్యాంకులు చెక్‌బుక్స్ వంటి సేవలను ఉచితంగానే అందించాల్సి ఉంటుంది. BSBDA సేవలను ఆర్బీఐ సడలించింది. ఏటీఎం నుంచి నెలకు నాలుగుసార్లు క్యాష్ విత్ డ్రా ఉచితం, బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్, ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదనే సడలింపులు ఉన్నాయి.

ఎటువంటి చార్జీ లేకుండానే

ఎటువంటి చార్జీ లేకుండానే

బీఎస్‌బీడీ ఖాతాకు సంబంధించి ఎటువంటి చార్జీ లేకుండానే ఏటీఎం కార్డు, పాస్‌పుస్తకం లభిస్తుంది. అయితే ఈ ఖాతా ఉన్న ఖాతాదారులు మరి ఏ ఇతర ఖాతాను కలిగి వుండడానికి వీల్లేదు. ఒక వేళ వుంటే ​అకౌంట్‌ను ఓపెన్‌ చేసిన 30 రోజుల వ్యవధిలోనే సదరు ఖాతాను మూసి వేయాల్సి వుంటుంది. అంతేకాదు నో ఫ్రిల్‌ ఖాతాలను తెరవడానికి ముందే...తనకు ఇతర బ్యాంకుల్లో బీఎస్‌బీడీ ఖాతా ఏదీ లేదని ధృవీకరణ కూడా చేయాల్సి వుంది.

బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్

బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్

నెలకు 4 సార్లు బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే బ్యాంకు ఖాతాల్లో ఎన్నిసార్లైన డిపాజిట్ చేసుకునే సదుపాయంతోపాటు ఉచిత ఏటీఎం లేదా డెబిట్ కార్డు జారీ, యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయరాదని ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
No minimum balance, more than 4 withdrawals allowed for no-frill accounts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X