'ఆండ్రాయిడ్ మార్కెట్' ఇక మీదట 'గూగుల్ ప్లే'

Posted By: Super

'ఆండ్రాయిడ్ మార్కెట్' ఇక మీదట 'గూగుల్ ప్లే'

 

ఆన్‌లైన్ మార్కెట్లో ఎలక్టానిక్ కంటెంట్ సేల్స్‌ని పెంచుకునేందుకు గాను సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆన్‌లైన్ స్టోర్‌ ఆండ్రాయిడ్ మార్కెట్ పేరుని 'గూగుల్ ప్లే' గా మార్చింది. స్టోర్ పేరుని మార్పు చేసిన గూగుల్ ఈ స్టోర్‌లో వీడియోలు, మ్యూజిక్, అప్లికేషన్స్, ఈ బుక్స్‌తో పాటు మొబైల్ డివైజ్‌లకు సంబంధించిన అన్ని రకాల ఆండ్రాయిడ్ మార్కెట్‌ అప్లికేషన్స్‌ని ఇందులో పొందుపరచనుంది. గూగుల్ చేసిన మార్పులను వినియోగదారులకు తెలియజేయడమే కాకుండా.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కేటలాగ్ రూపంలో భద్రపరిచింది.

ఆండ్రాయిడ్ మార్కెట్‌ని ప్రారంభించిన మూడున్నర సంవత్సరాల తర్వాత పేరు మార్పు చేశారు. గతంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే డివైజ్ లకు సంబంధించి అన్ని రకాల అప్లికేషన్స్‌ని ఆండ్రాయిడ్ మార్కెట్ నుండి డౌన్ లౌడ్ చేసుకునే వారు. ప్రస్తుతం మొబైల్ ప్రపంచంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హెచ్‌టిసి, ఎల్‌జీ, శాంసంగ్ లాంటి కొన్ని కంపెనీలు ప్రత్యేకించి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రత్యేకమైన మొబైల్స్‌ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

ధర్డ్ పార్టీ డెవలపర్స్ సుమారుగా 450,000 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని రూపొందించగా.. అదే డెవలపర్స్ ఆపిల్ ఐవోఎస్ ఉత్పుత్తులైన ఐఫోన్, ఐఫ్యాడ్ కోసం 550,000 అప్లికేషన్స్‌ని రూపొందించారు. ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ రంగంలో అమెజాన్, ఆపిల్ పోటీని తట్టుకునేందుకు గాను గతయేడాది ఆండ్రాయిడ్ మార్కెట్లో మ్యూజిక్, వీడియోలు, డిజిటల్ బుక్స్‌కు సంబంధించి అప్లికేషన్స్‌ని గూగుల్ విడుదల చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot