పాస్‌వర్డ్ తరచూ మారిస్తే ప్రమాదం, కొత్త పాలసీ యాడ్ చేసుకోండి

|

ఈ రోజుల్లో పాస్‌వర్డ్ అనేది మన జీవితంలొ చాలా ముఖ్యమైపోయింది. ప్రతీ దానికి సెక్యూరిటీ కోసం ఈ పాస్‌వర్డ్‌లను వాడుతుంటారు. అలాంటి పాస్‌వర్డ్‌లు ఎక్కడైనా లీక్ అయితే ఇక అంతే సంగతులు. మన అకౌంట్లు మొత్తం గుల్ల చేస్తుంటారు. ఇందులో భాగంగానే కంప్యూటర్ లాగిన్ పాస్ వర్డ్ నుంచి ఆన్ లైన్ బ్యాంకు అకౌంట్ వరకు అందరూ తమ పాస్ వర్డ్ లను తరచూ మారుస్తుంటారు.

పాస్‌వర్డ్ తరచూ మారిస్తే ప్రమాదం, కొత్త పాలసీ యాడ్ చేసుకోండి

కొన్నిసార్లు పాస్ వర్డ్ మరిచిపోయి రీసెట్ లాగిన్ పాస్ వర్డ్ సెట్ చేసుకుంటుంటారు. కానీ, ఇలా రెగ్యులర్ గా పాస్ వర్డ్ మార్చడం సెక్యూరిటీ పరంగా సేఫ్ కాదంటోంది మైక్రోసాఫ్ట్ కంపెనీ.అకౌంట్ పాస్‌వర్డ్‌లను తరచూ మారుస్తుంటే భద్రతపరమైన చిక్కులు తప్పవు అని హెచ్చరిస్తోంది.

ఎక్స్ పెయిరేషన్ పాలసీలను

ఎక్స్ పెయిరేషన్ పాలసీలను

యూజర్ల అకౌంట్ సెక్యూరిటీ కోసం మైక్రోసాఫ్ట్ పాస్‌వర్డ్ ఎక్స్ పెయిరేషన్ పాలసీలను అధికారికంగా తొలగించింది. ప్రత్యేకించి విండోస్ 10 సెక్యూరిటీ పాలసీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో మీ సిస్టమ్ పాస్ వర్డ్ ను రెగ్యులర్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు.

కొత్త సెక్యూరిటీ పాలసీలను

కొత్త సెక్యూరిటీ పాలసీలను

దీంతో పాటు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లకు మైక్రోసాఫ్ట్ పలు సూచనలు చేసింది. కొత్త సెక్యూరిటీ పాలసీలను యాడ్ చేసుకోవాలని, విండోస్ 10 డివైజ్ ల్లో మాత్రం పాస్ వర్డ్ రీసెట్ రూల్స్ ను అమలు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ ప్రకారం.. ఇది 2019 సంవత్సరం.. ఏడాదిలో రీసెట్ పాస్ వర్డ్ రూల్స్ కాలం చెల్లిందని సెక్యూరిటీ బ్లాగ్ లో కంపెనీ తెలిపింది.

దొంగలించినట్టుగా ఏదైనా ఆధారం ఉంటే

దొంగలించినట్టుగా ఏదైనా ఆధారం ఉంటే

ఒకవేళ పాస్ వర్డ్ ను ఎప్పటికీ దొంగలించలేని పక్షంలో పాస్ వర్డ్ ఎక్స్ పెయిరీ కావడం అనవసరం అని తెలిపింది. పాస్ వర్డ్ ను దొంగలించినట్టుగా ఏదైనా ఆధారం ఉంటే.. పాస్ వర్డ్ ఎక్స్ పెయిరేషన్ కోసం ఎదురుచూడకుండా వెంటనే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. పిరియాడిక్ పాస్‌వర్డ్ ఎక్స్ పేర్ కారణంగా చాలామంది యూజర్లు కొత్త పాస్‌వర్డ్‌ను యాడ్ చేసుకోవాల్సి వస్తోందని కంపెనీ తెలిపింది.

విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

విండోస్ 10’.. 10 బెస్ట్ ఫీచర్లు

కొత్త లుక్‌లో స్టార్ట్ మెనూ

విండోస్ 10లో పొందుపరిచిన స్టార్ట్ మెనూ కొత్త లుక్‌లో మరింత యూజర్ ఫ్రెండ్లీగా దర్శనమిస్తుంది. ఈ సరికొత్త స్టార్ట్ మెనూ సాంప్రదాయ అలానే మోడ్రన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది.విండోస్ 10లోని స్టార్ట్ మెనూతో సమీకృతం చేయబడిన సరికొత్త యూనివర్సల్ సెర్చ్ ఫీచర్ ద్వారా పీసీలో ఇన్స్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌లతో పాటు వెబ్‌లోని అంశాలను శోధించవచ్చు. మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజన్ ‘బింగ్' వెబ్‌సెర్చ్‌కు తోడ్పడుతుంది.

మల్టిపుల్ డెస్క్‌‌టాప్స్

యాపిల్ మ్యాక్ కంప్యూటర్స్ తరహాలో విండోస్ 10 యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై మల్టిపుల్ డెస్క్‌‌టాప్‌లను ఓపెన్ చేసుకుని వాటిలో కావల్సిన విండోలను ఓపెన్ చేసుకుంటూ సౌకర్యవంతమైన బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.సాధారణంగా విండోస్ యూజర్లు తమ పీసీ స్ర్కీన్ పై ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు Alt+Tab షార్ట్‌కట్‌ను వినియోగిస్తుంటారు. అయితే, విండోస్ 10 యూజర్ల కోసం మైక్రోసాఫ్ట్ ఓపెన్ చేసిన విండోలను సమీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన బటన్‌ను విండోస్ 10 టాస్క్‌బార్‌లో పొందుపరిచింది. ఈ టాస్క్ స్విచర్ మల్టీ టాస్కింగ్‌ను మరింత సులభతరం చేస్తుంది.

స్నాప్ వ్యూ

విండోస్ 10లో ఏర్పాటు చేసిన స్నాప్ వ్యూ ఫీచర్ ద్వారా ఏకకాలంలో నాలుగు అప్లికేషన్‌లను స్ర్కీన్ పై ఓపెన్ చేసుకుని లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.విండోస్ 10 యూజర్లు తమ పీసీలో మోడ్రన్ అప్లికేషన్‌లతో పాటు సాంప్రదాయ (ట్రెడిషనల్) అప్లికేషన్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.యూనివర్సల్ అప్లికేషన్ స్టోర్ యాప్ స్టోర్ విండోస్ 10 ఆధారిత డెస్క్‌టాప్, టాబ్లెట్ అలానే స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది. విండోస్ 10 యూజర్లు తమకు కావల్సిన యాప్‌లను ఈ స్టోర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

కాంటినుమ్

విండోస్ 10 నిక్షిప్తం చేసిన ప్రత్యేకమైన కాంటినుమ్ ఫీచర్ 2 ఇన్ 1 విండోస్ డివైస్‌లకు మరింత ఉపయుక్తంగా నిలస్తుంది. మీరు ఉపయోగించే మోడ్‌ను బట్టి ఉపయోగానికి అనువుగా స్ర్కీన్ రూపం మారుతుంటుంది.విండోస్ 10లో వినియోగించిన కమాండ్ ప్రాంప్ట్ సరికొత్త ఫీచర్లతో అలరిస్తుంది. వ్యాపార సంస్థలకు దోహదపడే విధంగా అత్యుత్తమ ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫామ్‌ను విండోస్ 10లో నిక్షిప్తం చేసినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

 

Best Mobiles in India

English summary
No Need To Regularly Change Your Password, As It's Actually Harmful To Security Says Microsoft

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X