సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే అంతే సంగతులు

ఏప్రిల్ నెలలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు చేయడానికి వ

|

ఏప్రిల్ నెలలో సార్వత్రిక సమరం మొదలవుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు రూపొందించుకున్న​ స్వచ్ఛంద నియమాలను ఎలక్షన్‌ కమిషనకు ఇవి నివేదించాయి.

సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తే అంతే సంగతులు

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌, ఇన్‌స్ట్రాగామ్, గూగుల్‌ షేర్‌ చాట్‌, టిక్‌ టాక్‌ ఇతర సంస్థల ప్రతినిధులు ఈ నిబంధనల పత్రంపై సంతకాలు చేశాయి.

సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు

సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు

ఐఏఎంఏఐతో సమావేశమైన ప్రధాన సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు తమకు తాము రూపొందించిన మోరల్‌ ఎతిక్స్‌ కోడ్‌ను ఎన్నికల కమిషన్‌కి సమర్పించాయి. ఈ సమావేశంలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్ట్రా, గూగుల్‌ షేర్‌ చాట్‌, టిక్‌ టాక్‌ ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సునీల్‌ అరోరా మాట్లాడుతూ..

సునీల్‌ అరోరా మాట్లాడుతూ..

ఈ సంధర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా మాట్లాడుతూ ఆయా వేదికలు కోడ్‌ సూత్రీకరణ చేయడం అవసరమైన, మంచి పరిణామమని అన్నారు. కాగా ఇండస్ట్రీ బాడీ, ఇంటర్నెట్ అండ్‌ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఐఏఎంఏఐ) కమిషన్‌కు, సోషల్ మీడియా సంస్థలు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.

సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం

సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం

ఈ నైతిక నిబంధనల ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నోడల్ ఆఫీసర్ హెచ్చరించారు.సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం ఆర్‌పీ 126 (రిప్రజెంటేషన్‌ అఫ్ పీపుల్) చట్టం, 1951 ప్రకారం నివేదించిన ఏదైనా ఉల్లంఘనలపై మూడుగంటల్లోనే పరిష్కరించడానికి తాము కట్టబడి ఉన్నామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

48 గంటల ముందు

48 గంటల ముందు

ఇదిలా ఉంటే ఆన్‌లైన్‌ ప్రచారం కోసం ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు స్వచ్ఛందంగా నిబంధనలను రూపొందించుకోవడం ఇదే మొదటిసారి. కాగా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, పోలింగ్‌ తేదీకి 48 గంటల ముందు రాజకీయ పార్టీల బహిరంగ ప్రచారంనిర్వహిచకూడదనే నిబంధన కొనసాగుతూ వస్తోంది.

స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్‌లో

స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్‌లో

ఓటర్లు స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగాఈ సాంప్రదాయం అమలవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఈ బాటలో నడవడం నిజంగా ఆశీర్వదించదగ్గ పరిణామం.

Best Mobiles in India

English summary
no political campaign be allowed major social media platforms last 48 hours

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X