సోషల్ మీడియాపై సెన్సార్ ఉండదు

Posted By: Staff

 సోషల్ మీడియాపై సెన్సార్ ఉండదు

 

బెంగళూరు: సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లపై సెన్సార్ విధించడం, నిలిపివేయడం జరగదని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయకమంత్రి సచిన్ పెలైట్ స్పష్టం చేశారు.

ఐతే ఆయా వెబ్‌సైట్లు భారత దేశ చట్టాలకు లోబడి సమాచారన్ని పొందు పరచాలని సూచించారు. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలలో ఏదైనా ఆశ్లీలత, పొరపాట్లు జరిగినట్లేతే ఆయా కంపెనీలు జవాబుదారీగా ఉండేటట్లు వ్యవహారించాలని అయన అన్నారు.

ఇటీవలే సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లలో అభ్యంతరకమైన సమాచారాన్ని పొందుపర్చుతూ యువతను పెడతోవపట్టిస్తున్నారని ఆరోపిస్తూ జర్నలిస్టు వినయ్‌రాయ్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన న్యాయమూర్తి 21 సామాజిక వెబ్‌సైట్లకు సమన్లు జారీచేశారు. వీటిని అందజేయాల్సిందిగా విదేశాంగశాఖను ఆదేశించారు. అయితే సమన్లు అందజేతకు కేంద్రం/రాష్ట్రం/ జిల్లా కలెక్టరు అనుమతి తప్పనిసరి కావడంతో సమన్లను చేరవేయలేదు. ఈ నేపథ్యంలో సంబంధిత వెబ్‌సైట్లపై న్యాయవిచారణకు అనుమతిస్తూ విదేశాంగశాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది.

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో ఇష్టానుసారం ట్వీట్స్ చేయడానికి వీల్లేకుండా... ఆయా దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా కొన్ని ట్వీట్లను సెన్సార్ చేయనున్నట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా పేర్కొంది. అభ్యంతరకర, రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ప్రోత్సహిస్తున్నారని, వాటిని ఫిబ్రవరి 6లోగా తొలగించాలంటూ ఇటీవలే పలు సామాజిక వెబ్‌సైట్లపై ఢిల్లీ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting