ఆసియాలో ఎటువంటి కాంపిటేటర్స్ లేరు అందుకే దూసుకుపోతున్నాం

Posted By: Super

ఆసియాలో ఎటువంటి కాంపిటేటర్స్ లేరు అందుకే దూసుకుపోతున్నాం

ప్రోపెషనల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ అయినటువంటి లింక్డ్ ఇన్ ఆసియాలో తన హెడ్ క్వార్టర్స్‌ని సింగ్ పూర్‌లో స్దాపించనున్నట్లు తెలియజేసింది. ఆసియాలో లింక్డ్ ఇన్ ప్రవేశించడం వల్ల గ్లోబల్‌గా తన సత్తాని చాటడానికేనని నిపుణులు తెలియజేశారు. ఇక ఆఫీస్‌ని సింగపూర్ లోని వన్ మారినా బౌల్ వార్డ్‌లో నెలకొల్పడమే కాకుండా దీనికి సంబంధించిన వ్యవహారాలను అన్నింటిని మేనేజింగ్ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అరవింద్ రాజన్ చూసుకోనున్నారని తెలియజేశారు. ఆసియా ఫసిఫిక్, జపాన్ రెండింటిని రాజనే మెయింటెయిన్ చేయనున్నారు.

ఈ సందర్బంలో అరవింద్ రాజన్ మాట్లాడుతూ రీజినల్‌లో మేము పాగా వేయడానికి హెడ్ క్వార్టర్స్ ముఖ్య భూమికను పోషించునుంది. ముఖ్యంగా మేము లింక్డ్ ఇన్‌ని ఇండియా, ఆస్ట్రేలియాలో ఆపరేషన్స్ ముందుకు తీసుకోని వెళ్శాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలియజేశారు. ఇండియా, ఆస్ట్రేలియా ఆఫీసులలో ఇప్పటికే కంపెనీ దాదాపు 50+ ఎంప్లాయిస్‌ని కలిగి ఉందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా డజన్ ఎంప్లాయిస్‌ని కంపెనీ హైర్ చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఆసియా ఫసిఫిక్ రీజియన్‌లో ఉన్నటువంటి 18మిలియన్ లింక్డ్ ఇన్ మెంబర్స్‌కు సంబంధించి సేల్స్, మార్కెటింగ్ చేసేటటువంటి నిపుణులను కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.

అరవింద్ రాజన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చివరకల్లా జపాన్‌లో ఆఫీసుని ఓపెన్ చేయనున్నట్లు తెలిపారు. దీనికి కారణం లింక్డ్ ఇన్‌కి జపాన్ కూడా మంచి మార్కెట్ కావడమే. ఇక చైనా విషయానికి వస్తే చైనాలో కూడా లింక్డ్ ఇన్‌కి దాదాపు సుమారుగా 1మిలియన్ లింక్డ్ ఇన్ మెంబర్స్ ఉండడంతో ఆసియా మీద దృష్టి పెట్టడం జరిగిందన్నారు. 2009లో లింక్డ్ ఇన్ మొట్టమొదటి ఆఫీస్‌ని ముంబైలో స్దాపించడం, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో స్దాపించడం జరిగిందన్నారు. ఆసియాలో లింక్డ్ ఇన్‌కి ఎటువంటి కాంపిటేటర్స్ కూడా లేకపోవడం మాకు కలసివచ్చే విషయం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot