యాహూ యూజర్లు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోనవసరం లేదు!

Posted By:

యాహూ యూజర్లు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోనవసరం లేదు!

టెక్నాలజీ ఇండస్ట్రీలో, సైబర్ సెక్యూరిటీ ప్రధాన సమస్యగా పెచ్చురిల్లిన నేపధ్యంలో ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీలు తమ వినియోగదారులకు సురక్షినతమైన సేవలనందించే ప్రత్రామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇటీవల హ్యాకింగ్ దెబ్బకు బెంబేలెత్తిని యాహూ తమ యూజర్లకు పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థను అందుబాటులలోకి తీసుకువచ్చింది. సెర్చ్ ఇంజిన్ కంపెనీ యాహూ ఆదివారం ‘ఆన్ డిమాండ్' పాస్‌వర్డ్స్ పేరుతో సరికొత్త సర్వీస్‌ను విడుదల చేసింది. ఈ సర్వీసును యాక్సెస్ చేసుకున్నట్లయితే యాహూ యూజర్లు ఇక పై తమ యాహూ అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవల్సిన అవసరం ఉండదు.

యాహూ యూజర్లు ఇకపై తమ పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోనవసరం లేదు!

ఆన్-డిమాండ్ పాస్‌వర్డ్ ఫీచర్ ఏలా పనిచేస్తుంది..?

ముందుగా ఎప్పటిలాగానే మీ యాహూ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొత్తగా పొందుపరిచన ఆన్ డిమాండ్  పాస్‌వర్డ్స్ ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకుని మీ ఫోన్ నంబరుతో రిజిస్టరవ్వండి. దీంతో, మీరు మీ అకౌంట్‌లోకి లాగిన్ అయిన ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసే ఫీల్డ్‌లో "send my password" అనే బటన్ ప్రత్యక్షమవుతుంది. ఈ బటన్‌ను ప్రెస్ చేసినట్లయితే యాహూతో రిజిస్టర్ అయిన మీ మొబైల్  నెంబర్ కు నాలుగు పదాల పాస్ వర్డ్ అందుతుంది. ఈ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసినట్లయితే మెయిల్ ఓపెన్ అవుతుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Nobody Can Remember Their Yahoo Passwords. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting