'డిజిటల్ గేమ్స్ కార్నివాల్‌'కి ఆతిధ్యం ఇవ్వనున్న 'గ్రేటర్ నోయిడా'

Posted By: Prashanth

'డిజిటల్ గేమ్స్ కార్నివాల్‌'కి ఆతిధ్యం ఇవ్వనున్న 'గ్రేటర్ నోయిడా'

 

గేమ్‌లపై ఆసక్తిని కనబర్చే వినియోగదారులకు శుభవార్త. దేశ రాజధాని న్యూఢిల్లీ మొట్టమొదటి సారి డిజిటల్ గేమ్స్ పండుగకు ఏప్రిల్ 6వ తారీఖున ముస్తాబయ్యేందుకు సిద్దమైంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్‌లో జాతీయ, అంతర్జాతీయ గేమర్స్ పాల్గోననున్నారు.

ఇండియా గేమింగ్ కార్నివాల్ (IGC)ని WTF Eventz ప్రెవేట్ లిమిటెడ్ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. తాజా డిజిటల్ ఆన్‌లైన్ గేమ్స్ అయినటువంటి ఫిఫా సాకర్, టెక్కన్, దోటా, కౌంటర్ స్ట్రైక్, హలో, పూల్, పోకర్, యాంగ్రీ బర్డ్స్తో సహా అన్ని అందుబాటులో ఉండనున్నాయని... అంతేకాకుండా ఇండియా గేమింగ్ కార్నివాల్ (IGC)ని నిర్వహించడానికి గల ముఖ్య కారణం భారతీయులు కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో గేమింగ్ ఎక్స్ పీరయన్స్‌ని ప్రతి ఒక్క భారతీయడు పొందాలని WTF Eventz ప్రెవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కుషాగ్రా తెలిపారు.

డెవలపర్స్, గేమర్స్, డీలర్స్‌తో పాటు యంగస్టర్స్ వారియొక్క ఐడియాలను షేర్ చేసుకునేందుకు గాను ఒక ప్లాట్ ఫామ్ లాగా ఇది ఉపయోగపడనుందన్నారు. ఈ ఈవెంట్ గ్రేటర్ నోయిడాలోని ఆయాట్టీ రీసార్ట్‌లో జరుగుతుంది. ఈ కార్నివల్‌లో ఆపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్‌కు నివాళులు అర్పించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అనుకున్న వారు ఒక రోజుకి గాను ఎంట్రీ పాస్ రూ 500, అదే మూడు రోజులకు కలిపి ఐతే రూ 1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot