Home
News

45 గంటల ప్లేబ్యాక్‌ టైంతో Noise నుంచి కొత్త ఎయిర్‌బడ్స్‌.. ఇవాళ్టి నుంచే సేల్‌

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్‌ నుంచి భారత మార్కెట్‌లోకి ఇవాళ కొత్త ఎయిర్‌బడ్స్‌ విడుదల అయ్యాయి. Noise AIr Buds Pro SE పేరిట వీటిని విడుదల చేసింది. ఈ ఎయిర్‌బడ్స్‌ 30dB వరకు ANC - యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. దీంతోపాటు సింగిల్‌ ఛార్జింగ్‌తో 45 గంటల ప్లేబ్యాక్ టైంతో వస్తాయి.

భారత్‌లో నేటి నుంచి నాయిస్‌ ఎయిర్‌ బడ్స్‌ ప్రో SE కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయమైన ధరకు వీటిని నోయిస్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కొత్త ఎయిర్‌బడ్స్‌ ధర రూ.1699గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌, నోయిస్‌ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. లస్టర్‌ బ్లాక్‌, షాంపైన్‌ గోల్డ్‌ రంగుల్లో ఇవి లభిస్తాయి.

Noise AIr Buds Pro SE TWS

నాయిస్‌ ఎయిర్‌బడ్స్‌ ప్రో SE ఇయర్‌ఫోన్లు మెటాలిక్ ఫినిష్‌తో వస్తాయి. ఈ ఇయర్‌ఫోన్లు ఇన్‌-ఇయర్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. నాణ్యమైన ఫోన్ కాల్స్‌ కోసం కొత్త ఇయర్‌బడ్స్‌ ENC- ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజిని కలిగి ఉంటాయి. దీంతోపాటు 30dB వరకు ANC- యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తాయి. దీంతోపాటు క్వాడ్‌ మైక్రోఫోన్‌ సెటప్‌ను కలిగి ఉంటాయి. మరియు 13mm డ్రైవర్‌తో వస్తాయి.

నాయిస్‌ కొత్త ఎయిర్‌బడ్స్‌ స్మార్ట్ టచ్‌ ఫీచర్‌తో వస్తాయి. ఫోన్‌ మాట్లాడేందుకు చాలా సౌకర్యవంతంగా ఇయర్‌ బడ్స్‌ టచ్‌ సెన్సిటివ్‌ ఏరియాపై ట్యాప్‌ చేయడం ద్వారా సౌండ్‌, సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ను నియంత్రించవచ్చు. మరియు మ్యూజిక్‌ను ప్లే మరియు ఆఫ్‌ చేయవచ్చు.

బ్యాటరీ విషయానికి వస్తే నాయిస్‌ ఎయిర్‌బడ్స్‌ ప్రో SE సింగిల్‌ ఛార్జింగ్‌తో 45 గంటల ప్లే బ్యాక్‌ టైంతో వస్తాయి. మరియు ఒక్కో ఇయర్‌బడ్‌ 7.5 గంటల బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది. ఇయర్‌బడ్స్‌ను కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చు. అదే ఛార్జింగ్‌ కేసును ఛార్జింగ్‌ చేసేందుకు 90 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఛార్జింగ్‌ కేసు ఇండికేటర్‌ను కలిగి ఉంటుంది.

నాయిస్‌ కొత్త ఎయిర్‌బడ్స్‌లో ఒక్కో ఇయర్‌బడ్స్‌ 3.3 గ్రాముల బరువు ఉంటుంది. మరియు ఛార్జింగ్ కేసు బరువు 33.3 గ్రాములు ఉంటుంది. దీంతోపాటు నాయిస్‌ ఎయిర్‌బడ్స్‌ ప్రో SE ఇయర్‌ఫోన్లు IPX5 నీరు, డస్ట్‌ రెసిస్టెన్స్‌తో వస్తాయి. దీంతోపాటు ఇవి బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ సపోర్టు, ఆండ్రాయిడ్, iOS సపోర్టు చేయనున్నాయి.

నాయిస్‌ ఎయిర్‌బడ్స్‌ ప్రో SE TWS ఇయర్‌బడ్స్‌ రూ.1,699కు నాయిస్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి లస్టర్‌ బ్లాక్‌, షాంపైన్‌ గోల్డ్‌ రంగుల్లో ఇవి లభిస్తాయి. మరియు 45 గంటల ప్లేబ్యాక్‌ టైంతో వస్తాయి. మరియు ANC, ENC టెక్నాలజీని సపోర్టు చేస్తాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Noise Air Buds Pro SE TWS Earbuds launched in India at RS1699
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X