Home
News

Noise Buds VS106 ఇయర్‌బడ్స్‌ విడుదల.. 50 గంటల బ్యాటరీ లైఫ్‌, ENC ఫీచర్‌..!

ప్రముఖ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ నాయిస్‌ సరి కొత్త ఇయర్‌ఫోన్స్‌ను (TWS) భారత్‌లో విడుదల చేసింది. Noise Buds VS106 పేరుతో వీటిని లాంచ్‌ చేసింది. ఈ ఇయర్‌బడ్స్‌ క్వాడ్‌ మైక్‌, ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్ సపోర్టుతో రానుంది. నాయిస్‌ కొత్త ఇయర్‌బడ్స్‌ బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ మరియు ఇన్‌స్టాఛార్జ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

నాయిస్‌ బడ్స్‌ VS106 ఇయర్‌బడ్స్‌ను 10 నిమిషాలపాటు ఛార్జింగ్‌ చేసి.. 200 నిమిషాల ప్లేటైంను వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. 10mm డ్రైవర్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆండ్రాయిడ్‌, iOS రెండింటిని సపోర్టు చేస్తుందని సంస్థ వెల్లడించింది. దీంతోపాటు చాలా ఫీచర్లు ఈ బడ్స్‌ సొంతం.

Noise Buds VS106 earphones launched

నాయిస్‌ బడ్స్‌ VS106 ఇయర్‌ఫోన్స్‌ను భారత్‌లో ప్రత్యేక ఆఫర్‌ కింద రూ.1,299కే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం GoNoise ఆన్‌లైన్‌ స్టోర్‌, అమెజాన్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌ఫోన్స్‌ క్లౌడ్‌ వైట్‌, జెట్‌ బ్లాక్‌, స్కై బ్లూ మూడు రంగుల్లో లభిస్తున్నాయి.

ఈ నాయిస్ కొత్త ఇయర్‌ఫోన్స్‌ 10mm డ్రైవర్‌ సహా స్టెమ్‌ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇవి బ్లూటూత్‌ 5.3 కనెక్టివిటీ సహా హైపర్‌ సింక్‌ టెక్నాలజీ సులభంగా జత చేసేందుకు అనుమతి ఇస్తాయి. ఇందులో గేమింగ్‌ కోసం ప్రత్యేకంగా గేమింగ్‌ మోడ్‌ను కలిగి ఉంది. 40ms వరకు అల్ట్రాలో లేటన్సీని కలిగి ఉంటాయి.

నాయిస్‌ బడ్స్‌ VS106లో ఇంటిగ్రేటెడ్‌ క్వాడ్‌ మైక్‌ మరియు స్పష్టమైన వాయిస్‌ కోసం ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్లను కలిగి ఉంది. చెమట, నీటి నుంచి రక్షణ కోసం IPX5 రేటింగ్‌తో వస్తుంది. దీంతోపాటు సౌకర్యవంతమైన కాలింగ్‌ కోసం సిరి, గూగుల్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఇయర్‌ ఫోన్స్ బరువు 3.8 గ్రాములు, ఛార్జింగ్‌ కేస్‌ బరువు 35.4 గ్రాములు ఉంటుంది.

నాయిస్‌ కొత్త ఇయర్‌ఫోన్స్‌ ఛార్జింగ్‌ కేస్‌తో సహా ఒక్క ఛార్జ్‌లో 50 గంటల ప్లే టైం ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కోసం ఇన్‌స్టా ఛార్జ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుందని తెలిపింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 200 నిమిషాల ప్లే టైం వస్తుందని సంస్థ చెబుతోంది. ఛార్జింగ్‌ కేస్‌ LED ఛార్జింగ్‌ ఇండికేటర్‌ సహా USB టైప్‌-C పోర్ట్‌తో వస్తుంది.

ఇటీవల కాలంలో చాలా సంస్థలు ఇయర్‌ ఫోన్లపై ఎక్కువగా దృష్టిపెడుతున్నాయి. అధిక బ్యాటరీ సహా యాక్టివ్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీ ఫీచర్‌తో విడుదల చేస్తున్నాయి. దీంతోపాటు చెమట, నీటి నుంచి రక్షణ కోసం IPX5 రేటింగ్‌ విడుదల చేస్తున్నాయి. ఇటీవల ప్రముఖ సంస్థ పోకో సైతం తొలిసారిగా ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో విడుదల చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Noise Buds VS106 earphones launched in india at rs 1299
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X