నోకియా నుంచి Android Go ఫోన్ వచ్చేస్తోంది...

Posted By: BOMMU SIVANJANEYULU

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా, తన మొట్టమొదటి Android Go స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నోకియా 1 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉండొచ్చని సమాచారం. ఈ ఫోన్‌కు సంబంధించిన చిత్రాలను చైనాకు చెందిన ఓ Baidu యూజర్ ఇటీవలే ఇంటర్నెట్‌లో లీక్ చేసారు. ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే నోకియా తన పాత రోజులను గుర్తుకు తెచ్చే విధంగా మెటల్ ఫ్రేమ్ అలానే పాలీకార్బొనేట్ బాడీతో ఈ ఫోన్‌లను తీసుకరాబోతోంది.

నోకియా నుంచి Android Go ఫోన్ వచ్చేస్తోంది...

మరో ఇమేజ్‌ను బట్టి చూస్తుంటే ఈ ఫోన్ 720 పిక్సల్ హెచ్‌డి డిస్‌ప్లేతో రాబోతున్నట్లు స్పష్టమవుతుంది . స్నాప్‌డ్రాగన్ 212 చిప్‌సెట్‌తో పాటు 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఎంట్రీ లెవల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఇదే విధమైన ప్రాసెసర్‌ను నోకియా 2లోనూ

హెచ్‌ఎండి గ్లోబల్ వినియోగించటం విశేషం. ఫిబ్రవరిలో జరిగే 2018 మొబల్ వరల్డ్ కాంగ్రెస్‌లో భాగంగా నోకియా 1 ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ మార్కెట్లో నోకియా 1 ధర రూ.6,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి 'Android Go' పేరుతో లైటర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ ఓరియో ఒరిజనల్ వర్షన్‌కు లైటర్ వర్షన్‌గా పేర్కొనబడుతోన్న ఆండ్రాయిడ్ గో సాఫ్ట్‌వేర్ ప్రత్యేకించి ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం డిజైన్ చేయబడింది. 1జీబీ అంతకంటే తక్కువ ర్యామ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్లలో Android Go లైటర్ వర్షన్ అతివేగంగా స్పందించగలుగుతంది.

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీతో Smartron t phone P, మీ కోసం బడ్జెట్ ధరలో !

ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌లో గూగుల్ గో, మ్యాప్స్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, అసిస్టెంట్ గో, ఫైల్స్ గో లాంటి యాప్స్ లభిస్తాయి. ఇవి చాలా తక్కువ సైజులో ఉంటాయి. ఇవి ర్యామ్ అలానే ప్రాసెస్ పై అంతంగా ఒత్తిడి తీసుకురావు. దీంతో ఫోన్ వేగం ఏ మాత్రం నెమ్మదించదు. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంతో లభ్యం కాబోతోన్న బేసిక్ ఆండ్రాయిడ్ హ్యాండ్‌సెట్‌లలో ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ సంఖ్య చాలా తక్కువుగా ఉంటుంది. దీంతో ఒత్తిడనేదే లేకుండా ఫోన్ వేగంగా పనిచేస్తుంది.

Android Go ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి చెప్పుకోదగ్గ అప్లికేషన్‌లలో 'ఫైల్స్ గో' యాప్ ఒకటి
ఈ యాప్‌, ఫోన్‌లోని అనవసర మెమురీనిని ఖాళీ చేయడంతో పాటు పరిమితికి మించి ఉన్న మెసేజ్‌లను
ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తుంటుంది.

Source

English summary
HMD Global is likely prepping to launch an Android Go smartphone called Nokia 1 that could be the most affordable one coming from the company. A couple of hands-on images of the alleged Nokia 1 smartphone have been leaked. The images show that the alleged design of this Android Go smartphone and its price is also out.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot