కొత్త కొత్తగా నోకియా

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ నిట్టూరుస్తూ మార్కెట్లో మాయమైన నోకియా ఫీచర్ ఫోన్ ను తలచుకునే అభిమానుల కోరిక తీరనుంది.

By Madhavi Lagishetty
|

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ నిట్టూరుస్తూ మార్కెట్లో మాయమైన నోకియా ఫీచర్ ఫోన్‌ను తలచుకునే అభిమానుల కోరిక తీరనుంది. ఒకప్పటి సాలిడ్ నోకియా బ్రాండ్ ఫీచర్ ఫోన్ మరోసారి మార్కెట్‌లోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్స్, ఆండ్రాయడ్ యుగంలో ఇప్పడు మరోసారి మీ జేబుల్లో నోకియా రింగ్ టోన్ మోగేందుకు సిద్ధంగా ఉంది. చాలా కాలం క్రితమే మాయమైన ఈ నోకియా ఫీచర్ ఫోన్ ఇప్పుడు కొత్త ఫీచర్లతో బేసిక్ మోడల్ షేప్‌తో మార్కెట్లోకి అడుగు పెట్టింది.

 
Nokia 105 and Nokia 130 feature phones launched; price starts at Rs. 990

హెచ్ఎండీ గ్లోబల్ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యాయి. రీడిజైన్ చేసిన నోకియా 105, నోకియా 130 ఫీచర్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో రెండు మోడల్స్‌లో సింగిల్, డ్యూయల్ సిమ్ వేరియంట్లలో ఈ ఫోన్‌లను విక్రయించనున్నారు. నోకియా 105 సింగిల్ సిమ్ వేరియంట్ ధర రూ.930 కాగా నోకియా 130 సింగిల్ సిమ్ మోడల్ ధర రూ. 1380గా ఉంటుంది. ఇంత తక్కువ ధరకు లభిస్తున్న ఓ బ్రాండెడ్ ఫీచర్ ఫోన్ ఇదే.

నోకియా 105...

నోకియా 105...

నోకియా 105 విషయానికి వస్తే..పాలీ కార్పోనేట్ బాడీతో 1.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగి ఇది 30+ సిరీస్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఎంతో పేరొందిన స్నేక్ జెన్‌జియా గేమ్ కూడా లోడ్ చేశారు. అలాగే 800 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 4 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజి కూడా ఉంది.

ఒక సారి చార్జీ చేస్తే 15 గంటల పాటు నిరాటంకంగా మాట్లాడవచ్చు. ఇఖ చార్జింగ్ పెడితే 31 రోజుల పాటు స్టాండ్ బైగా పనిచేస్తుంది. ఇక డ్యూయల్ సిమ్ వేరియంట్ లో అయితే 25 రోజుల పాటు బ్యాటరీ స్టాండ్ బై టైం ఇచ్చారు. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే బిల్టిన్ ఎఫ్ఎం రేడియో, మైక్రో యూఎస్‌బీ చార్జర్, 3.5 ఎంఎం ఆడియో పోర్ట్ ఉన్నాయి.

నోకియా 130...
 

నోకియా 130...

ఇక నోకియా 130 విషయానికి వస్తే ఇది కూడా సేమ్ 1.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేతో తో పాటు 8 ఎంబీల ఇంటర్నల్ స్టోరేజీ ఇచ్చారు. దీన్ని 32 జీబీ ల వరకూ మైక్రో ఎస్‌డీ కార్డుతో ఎక్స్‌పాండ్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక అలాగే దీని వెనుక భాగంలో కెమెరాతో పాటు బ్లూటూత్ సౌకర్యం కలిగిఉంది. బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 1020 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 11.5 గంటల పాటు వీడియో ప్లేబాక్ కెపాసిటీ, అలాగే 44.5 గంటల ఎఫ్ఎం రేడియో, అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఏర్పాటు చేశారు.

ధర, ఉపలభ్యత...

ధర, ఉపలభ్యత...

నోకియా 105 రెండు వేరియంట్లు విడుదల చేయగా అందులో సింగిల్ సిమ్ వేరియంట్ రూ.990 గా ధర నిర్ణయించగా, డ్యూయల్ సిమ్ ధర రూ.1149గా ధర నిర్ణయించారు.నోకియా 130 ధర విషయంలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Nokia 105 and Nokia 130 are two new features phones launched by HMD Global. Of these two, the Nokia 105 has been released in India starting from Rs. 990.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X