ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో నోకియా సత్తా చాటనుందా..?

Posted By:

‘నోకియా 1100' మరోసారి వార్తల్లో నిలిచింది. క్వాడ్‌కోర్ సీపీయూ ఇంకా ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో కూడిన నోకియా 1100 బెంచ్ మార్క్ ఫలితాలతో గీక్‌బెంచ్ సైట్‌‍లో ప్రత్యక్షమైంది. క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ-6582 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం వంటి స్పెసిఫికేషన్‌లతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ నోకియా స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుందని ఆన్‌లైన్‌‍లో ప్రత్యక్షమైన ఫలితాలు చెబుతున్నాయి.

720 డిస్‌ప్లే, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌తో కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వంటి అంశాలను నోకియా ఈ ఫోన్‌లో పొందుపరిచినట్లు ఈ బెంచ్ మార్క్ ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ నిజంగా వాస్తవరూపాన్ని అద్దుకుని మార్కెట్లోకి వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కనపెడితే నోకియా ఫోన్ లు మరోసారి మార్కెట్లో కనువిందు చేయునున్నయన్న సంకేతాలు మాత్రం స్ఫష్టంగా అందుతున్నాయి.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా 3310... 20వ శతాబ్థం ఆరంభంలో ఈ ఫోన్ పెద్ద సంచలనం. 2000 సంవత్సరంలో విడుదలైన నోకియా 3310 ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయి మొబైల్ ఫోన్ ల ప్రపంచంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

సెల్‌ఫోన్‌లో మొబైల్ గేమ్ ఆడాలంటే రెండు చేతులు అవసరమవుతాయి. అయితే, నోకియా 3310లో లోడ్ చేసిన స్నేక్ II, ప్యారిస్ II, స్పేస్ ఇంపాక్ట్, బాంటుమీ వంటి గేమ్‌లు కేవలం ఒక్క వేలుతో కంట్రోల్ చేయవచ్చు.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా 3310 అత్యుత్తమ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండేది.  నోకియా 3310ను సలువుగా రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను రిపేర్ చేసుకునేందుకు పెద్దగా విజ్ఞానం కూడా అవసరం లేదు.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

మండుటెండలో సైతం నోకియా 3310 డిస్‌ప్లే క్లియర్‌గా కనిపిస్తుంది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా 3310 సరిగ్గా ప్యాంట్ జేబులో ఇమిడిపోతుంది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా 3310ను 5000 సార్లు క్రింది పడేసినప్పటికి చెక్కుచెదరకుండా పనిచేస్తుంది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా మొదటి కెమెరా ఫోన్ ‘నోకియా 7650' 2001లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మైనార్టీ రిపోర్ట్‌లో వినియోగించారు. 2003లో నోకియా వీడియో రికార్డర్ తో కూడిన మొట్టమొదటి ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆ మోడల్ పేరు నోకియా 3650.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

2005లో నోకియా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిజిటల్ కెమెరాల విక్రయించిన బ్రాండ్‌గా గుర్తింపును మూటగట్టుకుంది. 2005లో నోకియా ఎన్70 పేరుతో డెడికేటెడ్ కెమెరా షట్టర్ బటన్‌తో కూడిన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

నోకియా నుంచి 2006లో విడుదలైన మరో కెమెరా ఫోన్ నోకియా ఎన్93 ఈ కెమెరా 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఫీచర్‌ను కలిగి ఉంది.

నోకియా ఫోన్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు

2008లో నోకియా కొడాక్‌కు మించి కెమెరాలను విక్రయించగలిగింది. 2011లో ప్రపంచపు అతిపెద్ద స్టాప్-మోషన్ యానిమేషన్ చిత్రాన్ని నోకియా ఎన్8 ద్వారా చిత్రీకరించటం విశేషం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 1100 may return with Android Lollipop. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot