ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో నోకియా 1100

Posted By:

ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో నోకియా 1100

ప్రముఖ నోకియా ఫీచర్ ఫోన్‌లలో ఒకటైన ‘నోకియా 1100' మరోసారి వార్తల్లో నిలిచింది. క్వాడ్‌కోర్ సీపీయూ ఇంకా ఆండ్రాయిడ్ లాలీపాప్‌తో కూడిన నోకియా 1100 బెంచ్ మార్క్ ఫలితాలతో  గీక్‌బెంచ్ సైట్‌‍లో ప్రత్యక్షమైంది. క్వాడ్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ-6582 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లాలీపాప్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం వంటి స్పెసిఫికేషన్‌లతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ నోకియా స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుందని ఆన్‌లైన్‌‍లో ప్రత్యక్షమైన ఫలితాలు చెబుతున్నాయి.

720 డిస్‌ప్లే, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్‌తో కూడిన 8 మెగా పిక్సల్ కెమెరా వంటి అంశాలను నోకియా ఈ ఫోన్‌లో పొందుపరిచినట్లు ఈ బెంచ్ మార్క్ ఫలితాల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ నిజంగా వాస్తవరూపాన్ని అద్దుకుని మార్కెట్లోకి వస్తుందా, రాదా అన్న విషయాన్ని పక్కనపెడితే నోకియా ఫోన్ లు మరోసారి మార్కెట్లో కనువిందు చేయునున్నయన్న సంకేతాలు మాత్రం స్ఫష్టంగా అందుతున్నాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Nokia 1100 With Android 5.0 Lollipop, Quad-Core Processor Spotted. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot