Home
News

Nokia 2.4 ఇండియా లో లాంచ్ అయింది.ధర మరియు బుకింగ్ వివరాలు చూడండి 

By Maheswara

ఎట్టకేలకు నోకియా కంపెనీ నుండి నోకియా 2.4 తాజా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా భారత దేశంలో లాంచ్ అయింది. ఇది డిసెంబర్ 2019 లో విడుదలైన నోకియా 2.3 కు కొత్త అప్ డేటెడ్ వెర్షన్. కొత్త నోకియా 2.4 ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరియు వివిధ అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు, ధర మరియు ప్రీ-ఆర్డర్ వివరాలను పరిశీలిద్దాం.

నోకియా 2.4 ఫీచర్లు

నోకియా 2.4 ఫీచర్లు

నోకియా 2.4 స్మార్ట్ ఫోన్ 6.5-అంగుళాల హెచ్‌డి + ఫిల్ డిస్‌ప్లేతో వస్తుంది మరియు, వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి పైభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది వేలిముద్ర సెన్సార్‌తో మరియు AI ఫేస్ అన్‌లాక్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో మీడియాటెక్ హెలియో పి 22 ప్రాసెసర్ తో నోకియా అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌లో పనిచేస్తుంది,అయినప్పటికీ  దీన్ని ఆండ్రాయిడ్ 11 కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.

నోకియా 2.4 కెమెరా వివరాలు

నోకియా 2.4 కెమెరా వివరాలు

ఫోన్ కెమెరా గురించి చెప్పుకుంటే, ఇది 13 MP వెనుక కెమెరా మరియు సెకండరీ 2 MP డెప్త్ సెన్సార్‌తో వస్తుంది. ముందు వైపు, సెల్ఫీలు కోసం 5 MP షూటర్ ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ తో రావడం వల్ల బాటరీ మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది.

ధర

ధర

నోకియా 2.4 ను మీరు కేవలం రూ.10,399 కు కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త నోకియా మొబైల్ 2020 నవంబర్ 26 నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రజలు నోకియా 2.4 ను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ఇతర రిటైల్ అవుట్‌లెట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ చార్ కోల్, ఫ్జోర్డ్ మరియు డెస్క్ వంటి మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది.

నోకియా అధికారిక వెబ్సైటు నుంచి బుక్ చేయొచ్చు.

నోకియా అధికారిక వెబ్సైటు నుంచి బుక్ చేయొచ్చు.

మీరు ఈ ఫోన్ ను నోకియా అధికారిక వెబ్సైటు నుంచి బుక్ చేయొచ్చు. వెబ్సైటు లో కి వెళ్లిన తర్వాత  దిగువన ఉన్న ‘ప్రీ-ఆర్డర్' బటన్ పై క్లిక్ చేయండి.తరవాత వివరాలు నమోదు చేయండి.  మీరు కంపెనీ వెబ్‌సైట్ నుండి నోకియా 2.4 ను కొనుగోలు చేస్తే, మీకు రూ.1,200 విలువైన ప్రత్యేకమైన 007 నో టైమ్ టు డై సరుకులను కూడా అందుకుంటారు. అయితే, ఈ ఆఫర్ వినియోగదారులందరికీ వర్తించదని మీరు గమనించాలి. ఆఫర్‌కు అర్హత పొందడానికి, 2020 నవంబర్ 26 నుండి 2020 డిసెంబర్ 4 వరకు విజయవంతంగా ఆర్డర్లు ఇచ్చే మొదటి వంద మంది వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరికొన్ని  నిబంధనలు మరియు షరతులను తెలుసుకోవడానికి మీరు కంపెనీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

Best Mobiles in India

English summary
Nokia 2.4 Launched In India. Check The Price And Availability Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X