ప్రీ-ఆర్డర్ పై నోకియా 2, ఈ నెలలోనే సేల్

|

హెచ్ఎండి గ్లోబల్ నుంచి కొద్ది రోజల క్రితం ఇండియన్ మార్కెట్లో అనౌన్స్ అయిన నోకియా 2 స్మార్ట్‌ఫోన్ మొదటిసారిగా ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-బుకింగ్స్ రష్యా మార్కెట్లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అక్కడి కరెన్సీ ప్రకారం ఈ ఫోన్ ధర RUB 7,990 (మన కరెన్సీలో షుమారుగా రూ.8,755). సేల్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ అవతుంది.

 
ప్రీ-ఆర్డర్ పై నోకియా 2, ఈ నెలలోనే సేల్

ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 6, నోకియా 7, నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే నోకియా 2 అత్యంత చకవైన స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తుందని హెచ్ఎండి గ్లోబల్ తెలిపింది. ప్రపంచ మార్కెట్లలో ఈ ఫోన్ ధర సగటుగా 99 డాలర్లలోపు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ అందుబాటుకు సంబంధించిన వివరాలు త్వరలోనే అఫీషియల్ వెల్లడయ్యే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా 1,00,000 ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా నోకియా 2 ఫోన్‌లను విక్రయిచేందుకుగాను హెచ్ఎండి గ్లోబల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అవసరమైన స్టాక్‌ను కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు తెలియవచ్చింది.

ప్లే స్టోర్‌లో నకిలీ WhastsAppప్లే స్టోర్‌లో నకిలీ WhastsApp

శక్తివంతమైన 4100mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ సింగిల్ చార్జ్ పై రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇవ్వగలదని హెచ్ఎండి గ్లోబల్ స్పష్టం చేసింది. ఇప్పటికే మార్కెట్లో అమ్ముడవుతోన్న Redmi 4A, Moto C వంటి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ డివైస్ పోటీదారుగా నిలవబోతోంది...

నోకియా 2 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్టీపీఎస్ డిస్‌ప్లే (1:1300 కాంట్రాస్ట్ రేషియోతో), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 212 సాక్ (క్వాడ్-కోర్, క్లాక్ స్పీడ్ అప్ టూ 1.2గిగాహెట్జ్), 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకావం.

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, కనెక్టువిటీ ఫీచర్లు..4G VoLTE, వై-ఫై 802.11 b/g/n, బ్లుటూత్ వీ4.1, జీపీఎస్/ఏ-జీపీఎస్), ఎఫ్ఎమ్ రేడియో విత్ ఆర్‌డిఎస్, మైక్రో-యూఎస్బీ సపోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్.

ఇక ఆన్‌బోర్డ్ సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సార్‌లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఐపీ52 రేటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ స్వల్ప ప్రమాదాలను తట్టుకోగలదు.

Best Mobiles in India

English summary
Nokia 2 has finally gone up for pre-orders in Russia and is now priced at RUB 7,990 (roughly Rs. 8,755).

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X