Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
నోకియా 225 4G ని కొత్తగా లాంచ్ చేయడానికి నోకియా సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన కంటే ముందు, ఈ ఫీచర్ ఫోన్ యొక్క 2024 ఎడిషన్ రెండర్‌లు కొన్ని స్పెసిఫికేషన్‌లతో పాటు ఆన్‌లైన్‌లో ప్రస్తుతం లీక్ అయ్యాయి. రెండర్‌లు నోకియా 225 కోసం రెండు రంగుల ఎంపికలను సూచిస్తున్నాయి.
ఇది USB టైప్-సి పోర్ట్ మరియు HMD యొక్క అంతర్గత S30+ OSతో వస్తుందని చెప్పబడింది. ఇది 64MB ర్యామ్ మరియు 128MB స్టోరేజీ ని తీసుకువస్తుంది. రాబోయే Nokia 225 4G 2024 ఎడిషన్ దాని 2020 వెర్షన్‌తో సమానంగా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెచ్. మెక్‌ఫ్లై (@ఆన్‌లీక్స్), ఆండ్రాయిడ్ హెడ్‌లైన్‌ల సహకారంతో, నోకియా 225 4G 2024 యొక్క ఎడిషన్ రెండర్‌లు మరియు స్పెసిఫికేషన్‌లను లీక్ చేసారు. ఈ లీకైన రెండర్‌లు ఈ ఫోన్‌ను పింక్ మరియు గ్రీన్ బ్లూ షేడ్స్‌లో HMD మరియు నోకియా బ్రాండింగ్‌తో చూపుతాయి. ఇది ఫ్లాష్‌లైట్‌తో పాటు వెనుకవైపు ఒకే కెమెరా సెన్సార్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ కొత్త Nokia 225 4G 2024 S30+ OSలో పనిచేస్తుంది. మరియు నంబర్ ప్యాడ్‌తో 2.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది వెనుకవైపు VGA కెమెరా లేదా 3-మెగాపిక్సెల్ కెమెరాను పొందవచ్చు. ఇది 128MB స్టోరేజ్ మరియు 64MB ర్యామ్‌ని కలిగి ఉంటుందని చెప్పబడింది.
ఈ ఫోన్ 1450mAh బ్యాటరీతో శక్తినివ్వగలదు. ఇది నోకియా 225 4G 2020 మోడల్ యొక్క 1150mAh బ్యాటరీ కంటే కొంచెం పెరుగుతుంది. ఈ నోకియా 225 4G 2024 ఫోన్ USB టైప్-C పోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ని కూడా కలిగి ఉండవచ్చు. పెద్ద బ్యాటరీ మరియు USB టైప్-సి పోర్ట్‌తో పాటు, కొత్త మోడల్ దాని 2020 డిజైన్ ను పోలి ఉండే అవకాశం ఉంది.
Nokia 225 4G 2024 ధర దాదాపు EUR 100 (దాదాపు రూ. 8,000) ఉంటుందని అంచనాలున్నాయి. ఈ నెలాఖరులో యూరప్ మరియు ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో అధికారికంగా లాంచ్ చేయాలని భావిస్తున్నారు. ఇది US లో విడుదల కాకపోవచ్చు. గతం లో HMD నోకియా 225 4G ని తిరిగి 2020లో విడుదల చేసింది, దీని ధర రూ. 3,499 గా ఉంది.
ఇదిలా ఉండగా, నోకియా N90 అనే ఫోన్ కాన్సెప్ట్ వీడియోను కూడా విడుదల చేశారు. ముఖ్యంగా ఈ Nokia N90 ఫోన్ త్వరలో గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నోకియా ఫోన్ ప్రత్యేకమైన ఫ్లిప్ డిజైన్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ ఫోన్ బయటకు వస్తే ఖచ్చితంగా అన్ని చోట్లా మంచి ఆదరణ లభిస్తుంది.
నోకియా N90 ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఆకర్షణీయమైన LED స్ట్రిప్స్ ఉన్నాయి, ఇవి చూపరులను ఆకట్టుకునే విధంగా Nothing ఫోన్ యొక్క LED స్ట్రిప్స్ ను పోలి ఉంటాయి. ఇది నోటిఫికేషన్ లైట్‌గా పని చేస్తుందని. ముఖ్యంగా ఇది నథింగ్ ఫోన్‌లలో మాదిరిగానే పని చేస్తుందని చెప్పారు.
ఈ Nokia N90 ఫోన్‌లో క్లాసిక్ D9 కీబోర్డ్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే ఈ ఫోన్ డ్యూయల్ డిస్ ప్లే సదుపాయాన్ని కలిగి ఉంది. ఇది వంగిన డిస్‌ప్లేతో వస్తుంది, ఇది ఫోన్‌ను ఉపయోగించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ 100MP కెమెరాతో వస్తుందని కూడా చెబుతున్నారు.
Image Source: @onleaks / android headlines


Click it and Unblock the Notifications








