Just In
Don't Miss
- News
జగన్ టార్గెట్ వారే: ఉన్మాది అన్నా తప్పేంటి అంటూ చంద్రబాబు ఏకిపారేశారు
- Lifestyle
జంటలు మార్నింగ్ సెక్స్ తో ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసా!
- Sports
ఐపీఎల్ వేలం 2020: గెలుపు గుర్రాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ఆరా!
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Movies
శక్తిమ్యాన్లా సూపర్ హీరో అవుతా.. వైరలవుతోన్న ట్రైలర్
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
గొప్ప తగ్గింపు ధరలను పొందిన నోకియా 3.2 & నోకియా 4.2
ఇండియా మార్కెట్ లో నోకియా మొబైల్ కు ఉన్నంత క్రేజ్ మరొక ఏ ఫోన్ కు లేదు. మొబైల్ ఫోన్ వచ్చిన కొత్తలో ఇండియాలో ప్రతి ఒక్కరు అంటే ప్రతి 10 మందిలో 7 మంది నోకియా మొబైల్స్ ఉపయోగిస్తు ఉండేవారు. రెండు మూడు సంవత్సరాల నుండి ఇండియా మార్కెట్ లోకి చైనా కంపెనీ యొక్క స్మార్ట్ ఫోన్లు ప్రవేశించడంతో నోకియా యొక్క హవా కాస్త తగ్గింది. గత సంవత్సరం నుండి నోకియా పుంజుకొని మళ్ళి తన సత్తా చాటుతోంది. నోకియా అభిమానుల కోసం ఇప్పుడు తన ఫోన్ల ధరను తగ్గించింది.

ఇండియాలో నోకియా 3.2 మరియు నోకియా 4.2 యొక్క ధరలు తగ్గింపును అందుకున్నాయని హెచ్ఎండి గ్లోబల్ సంస్థ ఇటీవల ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది మేలో MWC 2019 లో లాంచ్ చేసి ఇండియా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటి యొక్క ధరలను జూన్ నెలలో 500 రూపాయలకు తాత్కాలికంగా తగ్గించారు. ఇప్పుడు మరొక సారి ఈ రెండు ఫోన్లు మళ్ళీ ధర తగ్గింపును పొందాయి. నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ 1,791రూపాయలు తగ్గింపును పొందగా నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 1,491 రూపాయల ధర తగ్గింపును పొందింది.

తగ్గింపు పొందిన తరువాత ధరల వివరాలు
తగ్గింపు పొందిన తరువాత నోకియా 3.2 యొక్క 2 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం 7,999 రూపాయలు. అలాగే ఇందులో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 8,999 రూపాయలు. ఈ ఫోన్‌ను మొదట రూ.8,990 మరియు రూ.10,790 లకు అందుబాటులో ఉండేది. అంటే 2 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.991 తగ్గింపును , 3 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.1,791 తగ్గింపును పొందింది. ఇది బ్లాక్ మరియు స్టీల్ కలర్ ఎంపికలలో జాబితా చేయబడింది.
అదేవిధంగా నోకియా 4.2 యొక్క ఒకే ఒక వేరియంట్ 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ ప్రస్తుత ధర 9,499 రూపాయలు. ఈ ఫోన్‌ను మొదట 10,990 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ అయింది. అంటే నోకియా 4.2 స్మార్ట్ ఫోన్ 1,491 రూపాయలు తగ్గింపు పొందింది. ఇది బ్లాక్ కలర్ ఎంపికలో మాత్రమే జాబితా చేయబడింది.

ఆఫర్స్
కొత్త ధరలు నోకియా ఆన్లైన్ వెబ్‌స్టోర్‌లో కనిపిస్తున్నాయి. నోకియా ఆన్లైన్ స్టోర్ ద్వారా వీటిని కొనుగోలు చేసిన వారికి గొప్ప ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.2,500 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ వొడాఫోన్ మరియు ఐడియా చందాదారులకు 50 రూపాయల చొప్పున గల 50 వోచర్ల ద్వారా లభిస్తుంది. అంతే కాకుండా 9 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొత్త ధరలతో ఈ ఫోన్లు రిటైల్ దుకాణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

నోకియా 3.2 స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ నానో స్లాట్ గల నోకియా 3.2 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది. ఇది 19: 9 కారక నిష్పత్తితో గల 6.26-అంగుళాల HD + (720x1520 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఇది క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 429 SoC తో పనిచేస్తుంది. వీటితో పాటు ఇందులో 2GB మరియు 3GB RAM ఎంపికలు ఉన్నాయి.
కెమెరా యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే నోకియా 3.2 వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు ఎఫ్ / 2.2 ఆటో ఫోకస్ లెన్స్‌ను కలిగి ఉన్న ఒకే ఒక కెమెరా ఉంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందువైపు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
నోకియా 3.2 లో 32GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 400GB వరకు విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో భాగంగా ఇందులో 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, FM రేడియో, 3.5mm ఆడియో జాక్ మరియు మైక్రో- USB పోర్ట్ ఉన్నాయి. నోకియా 3.2 ఫోన్ వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.చివరిగా ఈ ఫోన్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

నోకియా 4.2 స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ నానో స్లాట్ గల నోకియా 4.2 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా పని చేస్తుంది. ఇది 5.71-అంగుళాల హెచ్డి + 720x1520 పిక్సెల్స్ డిస్ప్లేను 19: 9 కారక నిష్పత్తితో వాటర్‌డ్రాప్- నాచ్ స్టైల్ నిర్మాణంతో కలిగి ఉంటుంది. ఇది అడ్రినో 505 GPU మరియు 3GB RAM తో జతచేయబడి ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC తో పనిచేస్తుంది.

నోకియా 4.2లో కెమెరా యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుకవైపు ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా మరియు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

నోకియా 4.2 లో 32GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 400GB వరకు విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఇందులో 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, NFC, మైక్రో-యుఎస్బి 2.0 పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు కనెక్టివిటీ ఫ్రంట్‌లో ఎఫ్ఎం రేడియోతో వస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరగా ఈ ఫోన్ 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790