Home
News

నోకియా నుంచి పాపులర్‌ ఫీచర్‌ ఫోన్‌... 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రీలాంచ్‌..!

నోకియా ఫోన్లను తయారు చేసే HMD సంస్థ కీలక ప్రకటన చేసింది. నోకియా పాపులర్‌ ఫీచర్‌ ఫోన్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా X లో ఆసక్తికర పోస్ట్‌ చేసింది. నోకియా 3210 (Nokia 3210) ఫీచర్‌ ఫోన్‌ను మళ్లీ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. అయితే చిన్న డిజైన్‌, హార్డ్‌వేర్‌ మార్పులు కలిగి ఉంటాయని తెలుస్తోంది.

అయితే ఈ నోకియో ఫీచర్‌ ఫోన్ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ నోకియా 3210 ఫీచర్‌ ఫోన్‌ 1999లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఈ మార్చి 18 నాటికి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగానే ఈ హ్యాండ్‌సెట్‌ను రీలాంచ్‌ చేస్తున్నట్లు సమాచారం.

Nokia 3210 feature phone

అయితే ఈ నోకియా ఫోన్ అనేక రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. వైబ్రంట్‌ యెల్లో కలర్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే నోకియా 3210 ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు సంస్థ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. పాపులర్‌ ఫీచర్‌ ఫోన్‌ను మళ్లీ విడుదల చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది.

ఇప్పటికే నోకియా సంస్థ నుంచి 3310, 8210 4G, నోకియా 5710 వంటి ఫోన్‌లు గత కొన్ని సంవత్సరాల్లో మళ్లీ విడుదల అయ్యాయి. ఈ నోకియా 3210 ఫోన్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన స్నేక్‌ గేమ్‌ మరియు బెలూన్‌ గేమ్స్‌ను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం త్వరలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తున్న ఈ ఫోన్‌లో ఈ రెండు గేమ్స్‌ ఉంటాయో లేదో తెలియలేదు.

నోకియా ఫోన్ల తయారీ నుంచి HMD సంస్థ తప్పుకుందని. సొంత బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్ల తయారీపై దృష్టిసారిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా X ప్లాట్‌ఫాంలో HMD ప్రకటనతో ఈ వార్తలకు చెక్‌పెట్టినట్లు అయింది. అయితే నోకియా కొత్త ఫోన్లతోపాటు పాపులర్‌ మోడళ్లను రీలాంచ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

* గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్‌ అయిన నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్‌ వేరియంట్‌ ను ఈ నెల తొలివారంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రే, పర్పల్‌, పింక్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. మార్చి 8 నుంచి ఈ వేరియంట్‌ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 720*1612 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా ఎక్కువ రోజులు మన్నిక వచ్చేలా డిస్‌ప్లే్కు కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 3 రక్షణ పొందుతుంది. ఆక్టాకోర్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 480+ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. 2 సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నోకియా సంస్థ తెలిపింది. 20W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటుంది. హైరిజల్యూషన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్‌ సెన్సార్‌, 2MP మ్యాక్రో లెన్స్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ 8MP కెమెరాను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఈ నోకియా హ్యాండ్‌సెట్‌ డ్యూయల్‌ సిమ్‌ కార్డును సపోర్టు చేస్తుంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాట్‌ రెసిస్టెన్స్‌తో వచ్చింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia 3210 feature phone may re launch in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X