Nokia 5.3, Nokia C3 కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేసాయి!!! ధర కూడా అందుబాటులోనే...

|

ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు నోకియా 5.3, నోకియా C3 లను ఇండియాలో విడుదల చేసింది. ఇండియాలో నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన దాదాపు ఎనిమిది నెలల తర్వాత నోకియా కొత్త ఫోన్‌లను కంపెనీ ప్రవేశపెట్టింది. నోకియా 5.3 ఫోన్‌ను మొదట కంపెని మార్చి నెలలో నోకియా 1.3 మరియు నోకియా 8.3 5G లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించింది. అలాగే నోకియా C3 ని ఈ నెల ప్రారంభంలో చైనాలో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్-వేరియంట్‌ యొక్క ధర రూ.13,999 కాగా, 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.15,499. ఈ ఫోన్ సియాన్, సాండ్ మరియు చార్‌కోల్ వంటి కలర్ ఎంపికలలో వస్తుంది. దీనిని సెప్టెంబర్ 1 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నది. అయితే దాని ముందస్తు ఆర్డర్లు రేపటి నుంచి నోకియా సైట్ ద్వారా మొదలుకానున్నాయి.

నోకియా C3 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు
 

నోకియా C3 స్మార్ట్‌ఫోన్‌ ధరల వివరాలు

ఇండియాలో నోకియా C3 స్మార్ట్‌ఫోన్‌ను కూడా రెండు వేరియంట్‌లలో విడుదల చేసారు. ఇందులో 2GB ర్యామ్ + 16GB స్టోరేజ్ వేరియంట్‌ యొక్క ధర రూ.7,499 కాగా, 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ ఆప్షన్ యొక్క ధర రూ. 8,999. ఈ ఫోన్ సియాన్ మరియు సాండ్ వంటి కలర్ ఎంపికలలో వస్తుంది. ఈ ఫోన్ యొక్క అమ్మకాలు సెప్టెంబర్ 17 నుండి అందుబాటులోకి రానున్నాయి.

Also Read:Oppo F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలోనే రానున్నాయి!!! ఫీచర్స్ ఇవే...Also Read:Oppo F17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలోనే రానున్నాయి!!! ఫీచర్స్ ఇవే...

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతుంది. ఇది 6.55-అంగుళాల HD + డిస్ప్లేని 720x1,600 పిక్సెల్స్ పరిమాణంలో 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత రన్ అవుతూ 6GB LPDDR4x RAM తో జత చేయబడి ఉంటుంది.

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ఫొటోగ్రఫీ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో  ఎఫ్ / 1.8 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ 118-డిగ్రీ లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ 4,000mAh బ్యాటరీ

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ 4,000mAh బ్యాటరీ

నోకియా 5.3 స్మార్ట్‌ఫోన్‌ 64GB ఒకే ఒక స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఇందులో గల మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరిని 512GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ac, బ్లూటూత్ 4.2, GPS/ A-GPS, FM రేడియో, USB టైప్-సి, మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది. ఇది 10W ఛార్జింగ్‌ మద్దతుతో 4,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Also Read:ఇండియాలో విడుదల అవుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే ....Also Read:ఇండియాలో విడుదల అవుతున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇవే ....

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A SoC ద్వారా రన్ అవుతు 3GB RAM తో జతచేయబడ ఉంటుంది. ఇది 5.99-అంగుళాల హెచ్‌డి + IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఎఫ్ / 2.0 ఆటోఫోకస్ లెన్స్ మరియు ఎల్‌ఇడి ఫ్లాష్ ఫీచర్స్ తో 8 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాను కలిగి ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికలు

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఎంపికలు

నోకియా C3 స్మార్ట్‌ఫోన్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 16GB మరియు 32GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో గల మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరిని 128GB వరకు విస్తరించవచ్చు. ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇందులో 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో-యుఎస్‌బి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను కలిగి ఉంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Nokia 5.3, Nokia C3 Smartphones Released in India: Price, Sale Date, Specs and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X