ఈ ఒక్క ఫోన్ కే ఆ సెక్యూరిటీ!

By: Madhavi Lagishetty

మార్కెట్లోకి చాలా స్మార్ట్ ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. కానీ కొన్ని ఫోన్లపైన్నే వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే అలాంటి ఫోన్ల వెనక ఆండ్రాయిడ్ ఫ్లాట్ పాం ఉంటుందన్న సంగతి తెలియదు. అయితే ఇప్పటి వరకు మొబైట్ ఫ్లాట్ ఫాంను గూగులే శాసిస్తోంది.కానీ సెప్టెంబర్ లో రిలీజ్ అయిన నోకియా 5లో మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ను చేర్చారు.

 ఈ ఒక్క ఫోన్ కే  ఆ సెక్యూరిటీ!

నోకియా బ్రాండ్ అధికారాలను చేజిక్కించుకున్న HMD గ్లోబల్..ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచెస్ ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫిన్నిష్ కంపెనీ తన డివైస్లను తాజా ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ తో అప్ గ్రేడ్ చేయాలని ప్రణాళిక రెడీ చేస్తోంది.

జూలైలో రిలీజ్ అయిన రిలీజ్ అయిన నోకియా6...ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ను కలిగి ఉన్న మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. అయితే సెప్టెంబర్ లో రిలీజ్ అయిన నోకియా5 కూడా ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ ను కలిగి ఉంది.

142MB బరువుతో...కొత్త ఫ్రేంవేర్, ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంలో సెక్యూరిటీ బగ్స్ కోసం తాజా పరిష్కరాలను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ బులెటెన్లో లేదు.

మీరు నోకియా హ్యాండ్ సెట్ యూజర్లు అయితే..ఈ ఫోన్ ఆండ్రాయిడ్ క్లీన్ వెర్షన్స్ ను అమలు చేస్తుందని మీరు ఇప్పటికే తెలుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వినియోగదారులు ఒక బ్లోట్ -ఫ్రీ ఎక్స్ పీరియన్స్ తోపాటు ఆన్ -టైం అప్ డేట్స్ ను పొందుతారని చెప్పొచ్చు.

ఇకపై డబ్బులు చెల్లిస్తేనే వాట్సప్, ఫ్రీ కాదు !

HMD ఈ మధ్య అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత నోకియా స్మార్ట్ ఫోన్లు , ఆండ్రాయిడ్ 8.0 ఓరెయోకు అప్ డేట్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. నోకియా3, నోకియా5, నోకియా 6 స్మార్ట్ ఫోన్లు 2018వరకు ఆండ్రాయిడ్ ఓరెయో మరియు రాబోయే ఆండ్రాయిడ్ P అప్ డేట్ ను రిసీవ్ చేయడానికి సెట్ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన అప్ డేట్ ను రిలీజ్ చేసినప్పుడు కంపెనీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని నోకియా స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఓరెయో అప్ డేట్ తో వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Read more about:
English summary
The Android software update will fix some security bugs on Nokia 5.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot