Home
News

James Bond: No Time To Die యాక్షన్ సన్నివేశాలలో నోకియా 5G స్మార్ట్‌ఫోన్

ప్రముఖ హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నోకియా-బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తయారుచేస్తున్నది. స్మార్ట్‌ఫోన్‌లను తయారుచేయడంతో పాటు వాటిని ప్రజల వద్దకు తీసుకురావడానికి ప్రమోషనల్ లో భాగంగా వివిధ రకాల సంస్థలు అనేక పద్దతులను పాటిస్తూ ఉంటారు.

5G స్మార్ట్‌ఫోన్‌

5G స్మార్ట్‌ఫోన్‌

ఇప్పుడు నోకియా యొక్క మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ జేమ్స్ బాండ్ సిరీస్ యొక్క 25వ మూవీ నో టైమ్ టు డై మూవీకి అధికారిక మొబైల్ భాగస్వామిగా వ్వవహరించడంతో పాటుగా సంస్థ యొక్క 5G స్మార్ట్‌ఫోన్‌ను మూవీలోని ఏజెంట్ల చేతిలో యాక్షన్ సన్నివేశాలలో ప్రదర్శిస్తున్నట్లు సంస్థ వెల్లడించారు.

 

 

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్

నోకియా 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్

మార్చి 19 న UK లోని లండన్‌లో జరగబోయే ఒక కార్యక్రమం ద్వారా హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ యొక్క హీరో చేతుల మీదుగా ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఇప్పటికే ఆహ్వానం కూడా పంపినట్లు తెలిపింది. ఈ కార్యక్రమం బాండ్ యొక్క శైలిలో ఉంటుంది అని సూచిస్తుంది.

 

 

జేమ్స్ బాండ్ మూవీ

జేమ్స్ బాండ్ మూవీ

జేమ్స్ బాండ్ యొక్క 25వ మూవీ నో టైమ్ టు డై సినిమాలో నోకియా 7.2, నోకియా 3310 మరియు రాబోయే నోకియా 5G అనే మూడు నోకియా స్మార్ట్‌ఫోన్‌లను చిత్రీకరణ సమయంలో ఉపయోగించారు. ఈ చిత్రంలో లాషనా లించ్ పోషించిన ఏజెంట్ నోమిని నోకియా యొక్క కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించింది. ఇందులో 5G ఆధారిత ఫీచర్లను సద్వినియోగం చేసుకొని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సన్నివేశాలలో నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించినట్లు కంపెనీ ధృవీకరించింది.

 

 

లాషానా లించ్

నోకియా హ్యాండ్‌సెట్ తో లాషానా లించ్ నటించిన కొత్త ట్రైలర్ ను మార్చి 8న విడుదల చేస్తున్నట్లు ఫిన్నిష్ సంస్థ ప్రకటించింది. మార్చి 8 న విడుదలయే ట్రైలర్ లో నోకియా 5Gను మరింత దగ్గరగా చూడవచ్చు. బాండ్ మూవీ ప్రచారం కోసం నోకియా నుంచి రాబోయే 5G స్మార్ట్‌ఫోన్ గాడ్జెట్ ట్యాగ్‌లైన్ విభాగంలో చాలా వరకు అవసరమవుతుంది. ఈ ఫోన్ గురించి మరింత సమాచారం మార్చి 19 న అధికారికంగా వెళ్లడించనున్నారు.

 

 

 

లాషనా లించ్

లాషనా లించ్

నోకియా సంస్థతో గల అనుబంధం గురించి వ్యాఖ్యానిస్తూ లాషనా లించ్ ఇలా అన్నారు " వాస్తవానికి నేను 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నేను వాడిన మొదటి ఫోన్ నోకియా 3210. ఇది 90s నా స్మార్ట్‌ఫోన్. బటన్లు మరియు పేస్ లను మార్చగలిగినప్పుడు, స్నేక్ ఆడుతున్నప్పుడు నా మనస్సును కదిలించింది. నా బాల్యం నుండి ఇప్పటి వరకు నోకియా స్మార్ట్‌ఫోన్‌లు ఎంతగా అభివృద్ధి చెందాయో చూసిన తరువాత ఈ ఐకానిక్ బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించడంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని
తెలిపారు."

 

 

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

జేమ్స్ బాండ్ యొక్క 25వ మూవీ నో టైమ్ టు డై ఏప్రిల్ 2 న విడుదల చేయాలి అని నిర్మాతలు భావించారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ సినిమా యొక్క విడుదలను నవంబర్ 2 కి వాయిదా వేసినట్లు నిర్మాతలు ధృవీకరించారు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia 5G smartphone Set to Go For Action James Bond's No Time To Die
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X