జనవరిలో నోకియా 6 (2018)

|

నోకియా బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 మరోసారి మార్కెట్లో మెరవబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన 2018 వేరియంట్ జనవరిలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలో నోకియా బ్రాండ్ నుంచి విడుదలైన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా నోకియా 6 చరిత్రకెక్కింది.

 
జనవరిలో నోకియా 6 (2018)

ఈ సమాచారాన్ని బైడు వెబ్ సర్వీసెస్ యూజర్ ఒకరు లీక్ చేయగా గిజ్‌మోచైనా వెలుగులోకి తీసుకువచ్చింది. నోకియా 6 సక్సెసర్ వేరియంట్‌కు సంబంధించిన ఇమేజ్‌తో పాటు మోడల్ నెంబర్‌ను కూడా సదురు బైడు యూజర్ రివీల్ చేయటం జరిగింది.

లీకైన ఇమేజ్ ప్రకారం నోకియా 6 (2018) వేరియంట్ TA-1054 మోడల్ నెంబర్‌తో రాబోతోంది. ప్రాంతాన్ని బట్టి ఈ మోడల్ నెంబర్ మారుతుంది. సరిగ్గా ఇదే మోడల్ నెంబర్‌తో ఉన్న నోకియా స్మార్ట్‌ఫోన్ ఒకటి చైనా కమ్యూనికేషన్స్ కమీషన్ డేటా బేస్‌లో కొద్ది రోజుల క్రితం దర్శనమిచ్చింది. అప్పట్లో ఈ మోడల్‌ను నోకియా 9గా భావించారు. అయితే అది నోకియా 6 అని ఇప్పుడు తేలింది.

జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్జనవరి 8న హానర్ వ్యూ 10 స్మార్ట్‌ఫోన్, ఇండియాలో గ్రాండ్ ఈవెంట్

బైడు యూజర్ లీక్ చేసిన ఇమేజ్‌లో నోకియా 6 కొత్త వర్షన్‌కు సంబంధించి మెమెురీ కాన్ఫిగరేషన్ కూడా పొందుపరచబడి ఉంది. ఈ డివైస్ 4జీబి ర్యామ్ అలానే 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో రాబోతోంది. 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64 జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో కూడా ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డిజైన్ పరంగా నోకియా 6 (2018) వర్షన్ డ్యూరబల్ ఇంకా స్టర్డీ బిల్డ్‌తో రానుందట. ఫుల్ స్ర్కీన్ డిస్‌ప్లే ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఆన్-స్ర్కీన్ నేవిగేషనల్ బటన్స్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 660 సాక్ పై ఈ ఫోన్ రన్ అయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

Read more about:
English summary
Nokia 6 (2018) is likely in the making and the latest reports have tipped that it could be launched in three variants.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X