4జీబి ర్యామ్‌, 64జీబి స్టోరేజ్‌తో నోకియా 6 (2018) లాంచ్ అయ్యింది

Posted By: BOMMU SIVANJANEYULU

2018కిగాను హెచ్ఎండి గ్లోబల్ తన మొదటి నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. నోకియా 6 (2018) పేరుతో ఈ ఫోన్ అనౌన్స్ అయ్యింది. 2017లో లాంచ్ అయిన నోకియా 6తో పోలిస్తే లేటెస్ట్‌గా లాంచ్ అయిన నోకియా 6 (2018) మోడల్ శక్తివంతమైన ఇంటర్నల్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది.

4జీబి ర్యామ్‌, 64జీబి స్టోరేజ్‌తో నోకియా 6 (2018) లాంచ్ అయ్యింది

360 డిగ్రీ ఓజో ఆడియో, డ్యుయల్ సైట్ కెమెరా వంటి విప్లవాత్మక ఫీచర్లు ఈ కొత్త వర్షన్‌లో యాడ్ అవటంతో నోకియా 6 (2018) మోడల్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే లభ్యం..

ప్రస్తుతానికి నోకియా 6 (2018) స్మార్ట్‌ఫోన్‌ చైనాకు మాత్రమే పరిమితమైనప్పటికి రానున్న నెలల్లో భారత్, ఇండోనేషియా వంటి కీలక మార్కెట్లలో కూడా లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నోకియా 6 (2018) వర్షన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 4జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.14,600), 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ (ధర రూ.16,600). చైనా మార్కెట్లో జనవరి 10 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

నోకియా 6 (2018) స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి స్టోరేజ్ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఫేస్‌ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎఫ్ 2.0 అపెర్చుర్, డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

నోకియా 6 (2017) స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, ప్రభుత్వం సంచలన నిర్ణయం

జనవరి 19న నోకియా 9...

నోకియా 9 అఫీషియల్ లాంచ్‌కు సంబంధించి ఓ రిపోర్ట్ వెలువడింది. జనవరి 19న చైనాలో నిర్వహించబోయే ఓ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా 9 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేయబోతోంది. ఇదే కార్యక్రమంలో నోకియా 8 (2018) ఎడిషన్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. నోకియా 9కు సంబంధించిన ప్రొటెక్టివ్ కేస్‌లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లిస్ట్ అయి ఉన్న విషయం తెలిసిందే.

ప్రత్యేకమైన కస్టమ్ రోమ్‌తో లభ్యం..

ప్రముఖ చైనీస్ వెబ్‌సైట్ మైడ్రైవర్స్ రిపోర్ట్ చేసిన కధనం ప్రకారం నోకియా 9తో పాటు నెక్స్ట్ జనరేషన్ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లు చైనా యూజర్లకు అనువుగా ప్రత్యేకమైన కస్టమైజిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నయి. ఈ ఫోన్‌లలో గూగుల్ సర్వీసులకు బదులుగా లోకల్ సర్వీసులు ఉంటాయని తెలుస్తోంది. చైనా కస్టమర్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన కస్టమ్ రోమ్‌ను ఈ రెండు ఫోన్‌లతో ఆఫర్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
HMD Global has started their 2018 smartphone innings with the Nokia 6 (2018). The Nokia 6 (2018) is more or less an iterative upgrade of last year's Nokia 6 that comes with more powerful internals, a refined design and flagship features like 360 degree OZO audio and dual-sight camera capabilities.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot