నోకియా 6కు ఆండ్రాయిడ్ ‘Oreo’ అప్‌డేట్

By: BOMMU SIVANJANEYULU

నోకియా బ్రాండ్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు క్రమం తప్పకుండా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో పాటు ఓఎస్ అప్‌డేట్‌‌లు అందుతున్నాయి. ఇప్పటికే నోకియా 8కు సంబంధించి ఆండ్రాయిడ్ ఓరియో బేటా అప్‌డేట్‌ను రిలీజ్ చేసిన హెచ్‌ఎండి గ్లోబల్ అదే అప్‌డేట్‌ను నోకియా 5, నోకియా 3, నోకియా 6లకు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది.

నోకియా 6కు ఆండ్రాయిడ్ ‘Oreo’ అప్‌డేట్

ఈ ఏడాది చివరినాటికి ఓరియో బేటా అప్‌డేట్ వీటికి అందబోతోంది. ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు బదులుగా హెచ్‌ఎండి గ్లోబల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఈ వివరాలను రివీల్ చేసారు. నోకియా 6 కోసం రిలీజ్ చేసిన నవంబర్ సెక్యూరిటీ అప్‌డేట్‌లో భాగంగా క్రాక్ వై-ఫై వల్నరబులిటీని ఎదుర్కొనేందుకు అవసరమైన సెక్యూరిటీ ప్యాచ్‌లను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులో ఉంచింది.

క్రాక్ అంటే 'కీ రీఇన్‌స్టాలేషన్ అటాక్' అని అర్థం. ఈ వల్నరబలిటీ ఫోర్-వే అథింటికేషన్‌లోని మూడవ స్టెప్‌ను టార్గెట్ చేస్తుంది. అంటే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని వై-ఫై క్లయింట్, ప్రొటెక్టెడ్ వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతోన్న సమయంలో ఈ దాడి జరిగే అవకాశం ఉంటుంది.

ఫోర్-వే అథింటికేషన్‌లోని మూడవ స్టెప్‌లో ఎన్‌క్రిప్షన్ కీ అనేక సార్లు రీసెంట్ కాబడుతుంది. ఈ సమయంలోనే అటాకర్లు ఆ ఎన్‌క్రిప్షన్ కీని కలెక్ట్ చేసుకుని వై-ఫై సెక్యూరిటీ ఎన్‌క్రిప్ష‌న్‌ను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా బ్రేక్ చేసినపుడు ఆ నెట్‌వర్క్ ద్వారా మీరు నిర్వహించుకునే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీ హ్యాకర్లు తెలుసుకునే వీలుంటుంది. వై-ఫైకు కనెక్ట్ అయ్యే ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ క్రాక్ వై-ఫై దాడికి దగ్గరగా ఉన్నట్లేనని నిపుణులు చెబుతున్నారు.

అమెజాన్ నుండి సిమ్ కార్డులు ఎలా కొనుగోలు చేయాలి!

నవంబర్ సెక్యూరిటీ అప్‌డేట్‌ టాపిక్‌ను పక్కన పెడితే, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌కు త్వరలోనే ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ అప్‌డేట్ లభించబోతోంది. నోకియా 8కు సంబంధించి ఆండ్రాయిడ్ ఓరియో బేటా టెస్టింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన హెచ్‌ఎండి గ్లోబల్ ఇతర నోకియా ఫోన్‌లలో టెస్టింగ్‌ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టంలలో ఒకటైన ఆండ్రాయిడ్ ఓరియో, నౌగట్ వర్షన్‌తో పోలిస్తే అప్‌డేటెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అందిస్తోంది. నోటిఫికేషన్ మోడ్, పిక్షర్ ఇన్ పిక్షర్ మోడ్, న్యూ సెట్టింగ్ పేజ్, నోటిఫికేషన్ డాట్స్, నోటిఫికేషన్స్ క్యాటగిరీ, స్నూజ్ నోటిఫికేషన్స్, సెటప్ ఆల్బమ్ బ్యాక్‌గ్రౌండ్, ఆటోఫిట్ ఫ్రేమ్‌వర్క్, స్మార్ట్ టెక్స్ట్ సెలక్షన్, సిస్టమ్ ఆప్టిమైజేషన్స్ వంటి మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్‌‌ను ఈ అప్‌డేట్‌తో గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

English summary
Nokia 6 Android Oreo beta update is all set to be rolled out soon, confirms HMD’s CPO Juho Sarvikas.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting