ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999

By Madhavi Lagishetty
|

నోకియాను సొంతం చేసుకున్న HMD గ్లోబల్ మొబైల్ మార్కోట్లో నోకియాకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎన్నోప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈమధ్యే రిలీజ్ చేసిన బడ్జెట్ ఫోన్ నోకియా2పై ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో 6,999రూపాయలకు త్వరలో అందుబాటులోకి రానుంది. అంతేకాదు మరొక డివైస్ గురించి కంపెనీ ప్రకటించనుంది.

 
ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999

నోకియా 6 జూన్లో అమెజాన్ ఇండియా నుంచి ఎక్స్ క్లూజివ్ గా ప్రారంభించారు. ఆగస్టు మధ్యకాలంలో 14,999రూపాయలకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. Hmd గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా మాట్లాడుతూ...నోకియా 6 కూడా ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉందని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. శుక్రవారం నుంచి నోకియా 6 స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా మరియు ఆఫ్ లైన్ రిటైల్ దుకాణాల ద్వారా అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం ఇండియాలో నోకియా6, 14,999రూపాయలకు అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. దేశంలో రెండుసార్లు ఫ్లాష్ అమ్మకానికి మోడల్ వెళ్లింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్లో అందుబాటులో ఉంది. అంతేకాదు అన్ని రకాల నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్లో రెండింటి ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

నోకియా బ్రాండ్ తో hmd గ్లోబల్ రిలీజ్ చేసిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ నోకియా6. తొలి నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్, స్పెసిఫికేషన్ ప్యాక్ తో మిడిల్ రేంజ్ డివైస్ గా సక్సెస్ అయ్యింది. అంతర్జాతీయ వేరియంట్ MWC 2018లో నోకియా5 , నోకియా 3 స్మార్ట్ ఫోన్లతోపాటు ప్రదర్శించబడింది.

SBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండిSBI YONO యాప్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి

Best Mobiles in India

Read more about:
English summary
Nokia 6 that was an Amazon India exclusive is now available via the offline stores in the country for the same price of Rs. 14,999.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X