ఈ ఫోన్ ధర పర్మినెంట్‌గా రూ. 2వేలు తగ్గింది

|

నోకియా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సదవకాశం. ఎందుకంటే హెచ్ఎండీ గ్లోబ‌ల్ తన నోకియా 7.1 స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ ఫోన్‌ను మొత్తంగా రూ.3,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. కాగా ఇది వరకే నోకియా 1, 2.1 ఆండ్రాయిడ్ గో ఎడిష‌న్, నోకియా 6.1 ప్ల‌స్ 6జీబీ ర్యామ్ వేరియెంట్‌ల‌పై భార‌త్ లో ధ‌ర త‌గ్గించిన విష‌యం విదిత‌మే.ఇప్పుడు ఆ కంపెనీ నోకియా 7.1 ధ‌ర‌ను కూడా భార‌త్‌లో త‌గ్గించింది.

ఈ ఫోన్ ధర పర్మినెంట్‌గా రూ. 2వేలు తగ్గింది

 

దీంతో రూ.19,999 ఉన్న నోకియా 7.1 ఫోన్ ధ‌ర ఇప్పుడు రూ.17,999 అయింది. అయితే ప‌లు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌పై మ‌రింత డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ఈ ఫోన్‌ను రూ.16,999 ధ‌ర‌కే వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

నోకియా 7.1 ఫీచర్లు

నోకియా 7.1 ఫీచర్లు

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మహేశ్ టెలికం

మహేశ్ టెలికం

ఇప్పుడు ముంబైకి చెందిన స్మార్ట్‌ఫోన్ రిటైలర్ మహేశ్ టెలికం ఈ ఫోన్‌ను రూ.16,999కే అందిస్తోంది. దీంతో మొత్తంగా చూస్తే ఫోన్ ధర రూ.3,000 తగ్గినట్లు అయ్యింది. ఇతర డీలర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నోకియా 7.1 ఫోన్‌‌పై ఈ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నాయనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.

కేకేఆర్ మ్యాచ్ డేస్
 

కేకేఆర్ మ్యాచ్ డేస్

కాగా హెచ్ఎండీ గ్లోబ‌ల్ త‌న వెబ్‌సైట్‌లో కేకేఆర్ మ్యాచ్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను కూడా నిర్వ‌హిస్తున్న‌ది. అందులో భాగంగా నోకియా 8.1, 7.1. 6.1 ప్ల‌స్‌, 5.1 ప్ల‌స్‌, నోకియా 81104జీ ఫోన్ల‌పై 15 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్

అయితే ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ్యాచ్‌లు ఆడేట‌ప్పుడే ఈ డిస్కౌంట్ ల‌భిస్తుంది. అందులో భాగంగా ఈ నెల 14, 19, 21, 25, 28 తేదీల‌లో ముందు చెప్పిన ఫోన్ల‌పై హెచ్ఎండీ గ్లోబ‌ల్ వెబ్‌సైట్‌లో డిస్కౌంట్ ఇస్తారు.

5.84 ఇంచుల భారీ డిస్‌ప్లే

5.84 ఇంచుల భారీ డిస్‌ప్లే

ఈ ఫోన్లో 5.84 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరాను అమర్చారు. గ్లోస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లోస్ స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల అయింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 7.1 India price permanently drops by Rs 2,000, here's the new price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X