నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ !

By: Madhavi Lagishetty

హెచ్ఎండి గ్లోబల్ నుంచి మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. నోకియా 8 పేరుతో ఉన్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 16న రిలీజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ ప్రారంభించడానికి వారం రోజులు ఉన్నప్పటికి....ధర లభ్యత గురించి అనేక సార్లు ఆన్ లైన్ లో వెల్లడైనట్లు సమాచారం.

నోకియా నుంచి మరో స్మార్ట్ ఫోన్ !

ఇప్పటికే నోకియా 8 గురించి చాలా రూమర్స్ వచ్చాయి. నోకియా 8 కార్ల్ జీస్ బ్రాండింగ్ తోపాటు డ్యుయల్ లెన్స్ కెమెరాతో వస్తుంది. కానీ కెమెరా రిజల్యూషన్ గురించి మునుపటి నివేదికలలో స్పష్టంగా లేదు. ఇప్పుడు చైనా సైట్ VTechgraphy ఫోన్ ఎరినా నుంచి 13మెగాపిక్సెల్ కెమెరా అని స్పష్టత వచ్చిందనే వాదనలు ఉన్నాయి. రాబోయే నోకియా 8, 13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్స్ కూడా ఉంటాయి.

డ్యుయల్ కెమెరా సెన్సార్ రెండు 13మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉంది. ఆర్ జిబి సెన్సార్ తోపాటు మోనోక్రోమాటిక్ సెన్సార్ ను కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 SoC 4జిబి ర్యామ్, 64జిబి డిఫాల్ట్ మెమెరీ స్పేస్ తో జత చేయబడ్డాయి. అలాతే డిస్ ప్లే, జైస్ బ్రాండింగ్ తో 5.3అంగుళాల ప్యానెల్ ను కలిగి ఉంది.

భారీ డిస్కౌంట్ పొందిన టీవీలు ఇవే..

నోకియా 8 కూడా 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 4కె వీడియోలను షూట్ చేయగలదని, సెల్ఫీలను కూడా క్లిక్ చేస్తుందని నివేదిక పేర్కొంది. నోకియా 8 మెయిన్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో ప్రిఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. కానీ హెచ్ఎండి గూగుల్ తాజా వెర్షన్ ఆండ్రాయిడ్ లో నడుస్తున్నట్లు స్మార్ట్ ఫోన్ కనిపించింది.

నోకియా 8 ధర గురించిన సమాచారం ఈ మధ్యే వెల్లడైంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 40,000 . అయినప్పటికీ నోకియా గురించి వివరాలను హెచ్ఎండి గ్లోబల్ నుంచి ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

Read more about:
English summary
Nokia 8 slated to be launched on August 16 might arrive with a 13MP selfie camera on board, claims a recent report.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting