Home
News

నోకియా నుంచి గుడ్ న్యూస్, నోకియా 8.1 ధర భారీగా తగ్గింది

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌ను 2018 డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు నోకియా లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌పై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ ఫోన్‌కు చెందిన 4/6 జీబీ ర్యామ్ వేరియెంట్లు రెండింటి ధరలను రూ.7వేల మేర తగ్గించారు. నోకియా 8.1 ను రాయితీ ధరల్లోఅందుబాటులోకి తీసుకొచ్చింది.

నోకియా నుంచి గుడ్ న్యూస్, నోకియా 8.1 ధర భారీగా తగ్గింది

బేసిక్‌ వేరియంట్‌ (4జీబీర్యామ్/64 జీబీ స్టోరేజ్‌) తోపాటు, హై ఎండ్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీ డివైస్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.26,999 ఉండగా, ఇప్పుడిది రూ.19,999 ధరకు లభిస్తున్నది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.29,999 ఉండగా ఇప్పుడీ వేరియెంట్ రూ.22,999 ధరకు లభిస్తున్నది. ప్రస్తుతం తగ్గించిన ధరలకే ఈ రెండు వేరియెంట్లను విక్రయిస్తున్నారు.

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ఆఫర్‌ :

ఎయిర్‌టెల్‌ కస్టమర్లకు ఆఫర్‌ :

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు రూ.199 కన్నా ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే 1టీబీ అదనంగా 4జీ డేటా లభిస్తుంది. రూ.499 లకుపైన రీచార్జీ్‌ చేసుకునే పోస్ట్‌ పోయిడ్‌ వినిగాదారులకయితే 120 జీబీ డేటా అదనం. అలాగే మూడు నెలల నెట్‌ఫ్లిక్స్‌ ఉచితం. అమెజాన్‌ ప్రైమ్‌ ఏడాది పాటు ఉచితంగా లభిస్తోంది.

MATCHDAYS' ప్రోమో కోడ్

MATCHDAYS' ప్రోమో కోడ్

నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్ మాత్రమే కాదు... 'MATCHDAYS' ప్రోమో కోడ్ ఉపయోగించిన వారికి వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, రూ.4000 విలువైన గిఫ్ట్ కార్డు కూడా ఇస్తోంది. నోకియా. 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ కూడా ఉంది.

   నోకియా 8.1 ధరలు

నోకియా 8.1 ధరలు

4జీబీర్యామ్/64 జీబీ స్టోరేజ్‌ లాంచింగ్‌ ధర రూ. 26,999 ప్రస్తుత ధర రూ. 19.999

6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ లాంచింగ్‌ ధరధర రూ. 29,999, ప్రస్తుత ధర రూ. 22.999

నోకియా ఇండియన్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

 

నోకియా 8.1 ఫీచర్లు

నోకియా 8.1 ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

 ఆకట్టుకునే ఫీచర్లు

ఆకట్టుకునే ఫీచర్లు

ఇందులో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో లభిస్తోంది.

ఇతర నోకియా ఫోన్లపై తగ్గింపు

ఇతర నోకియా ఫోన్లపై తగ్గింపు

నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరొక్కో ఫోన్లపై రూ.1,000 తగ్గింపు అందుబాటులో ఉంది. దీని కోసం ఫ్యాన్‌ఫెస్టివల్ అనే ప్రోమోకోడ్ ఉపయోగించాలి. మరోవైపు హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ తన నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై పరిమిత కాల ధర తగ్గింపు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నోకియా 6.1 ప్లస్ 4 జీబీ ర్యామ్ వేరియంట్, నోకియా 5.1 ప్లస్ 3 జీబీ ర్యామ్ వేరియంట్‌పై రూ.1,750 ప్రమోషనల్ డిస్కౌంట్ ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
NOKIA 8.1 RECEIVES PRICE CUT IN INDIA, NOW STARTS AT RS 19,999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X