5 కెమెరాల నోకియా 9 ప్యూర్‌వ్యూ ఇండియాకు వచ్చేస్తోంది
అదిరిపోయో కెమెరా ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా.. 5 కెమెరాల స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా..అయితే మీ కోరిక త్వరలో తీరనుంది. HMD Global దిగ్గజం నోకియా అదిరిపోయే నోకియా స్మార్ట్‌ఫోన్ ను ఇండియా మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. దీని పేరే నోకియా 9 ప్యూర్‌వ్యూ. ఇందులో వెనుక భాగంలో ఏకంగా ఐదు కెమెరాలు ఉంటాయి.

కంపెనీ ఈ ఫోన్‌ను తొలిగా ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఎండబ్ల్యూసీ సదస్సులో ఆవిష్కరించింది. అయితే అప్పటి నుంచి ఈ ఫోన్ లాంచింగ్ వాయిదా పడుతూనే ఉంది. అయితే నోకియా మొబైల్ ఇండియా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫోన్ టీజర్ విడుదల చేసింది. త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫీచర్లు
5.99 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ పీఓలెడ్ డిస్‌ప్లే, 2560×1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12 మెగాపిక్సల్ పెంటా బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెంట్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ధర
నోకియా 9 ప్యూర్ వ్యూ ఫోన్ మిడ్‌నైట్ కలన్ ఆప్షన్ లో మాత్రమే విడుదలైంది. ఇక ఈ ఫోన్ ధర రూ.49,650 గా ఉంది. మార్చి నెలలో పలు ఎంపిక చేసిన దేశాలకు చెందిన మార్కెట్లలోనే ఈ ఫోన్‌ను విక్రయాలు ప్రారంభం అయ్యాయి. ఇండియాలో కూడా త్వరలో ప్రారంభం కానున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది.

12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న 5 కెమెరాలు
ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 12 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న 5 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదే ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక ఈ కెమెరాలతో ఫొటోలను RAW "DNG" ఫార్మాట్‌లో కాప్చర్ చేసి వాటిని అడోబ్ లైట్‌రూంలో ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ ఫోన్‌కు ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

6 జీబీ ర్యామ్
అలాగే 5.99 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ పీఓలెడ్ డిస్‌ప్లేను ఇందులో అమర్చారు. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్ లను ఏర్పాటు చేసినందున ఫోన్ వేగవంతమైన ప్రదర్శనను ఇస్తుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. వాటర్ రెసిస్టెంట్, వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు.

సెన్సార్లు ఇవే
గతంలో ఒకట్రెండు కెమెరాలతో ఫోన్‌లు రావడమే గొప్ప. ఇటీవల ట్రిపుల్ కెమెరా ఫోన్లు చూస్తున్నాం. ఇప్పుడు నోకియా ఐదు కెమెరాలతో ఫోన్ తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు మొత్తం ఏడు రింగ్స్ ఉంటాయి. రెండు రింగ్స్‌లో 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లు, మూడు 12 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉంటాయి. ఆరో రింగ్‌లో డ్యూయెల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, ఏడో రింగ్‌లో డ్యూయల్ సెన్సార్ ఉంటాయి.

కెమెరా హైలెట్స్
ఫొటో తీసేప్పుడు హైలైట్స్‌ను, నీడల్ని దాచుకుని, డెప్త్ ఆఫ్ ఫోకస్ ఎడిట్స్‌కు మరింత సామర్థ్యం కల్పించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫోన్ 240 మెగాపిక్సెల్ రిజల్యూషన్‌తో ఫొటోలు తీయగలదని వివరిస్తోంది. వీటికున్న ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ వల్ల ఫొటోల్లోని సమాచారం స్పష్టంగా ఉంటుంది.వీటిలోని రెండు కెమెరాలు RGB సెన్సార్ ద్వారా రంగులను తీసుకుంటాయి.మిగిలిన మూడూ మోనోక్రోమ్ కెమెరాలు, ఇవి అందుబాటులో ఉన్న కాంతికి మూడురెట్ల కాంతిని గ్రహిస్తాయి. దీనివల్ల ఎలాంటి ఫిల్టర్లూ అవసరం లేకుండానే వివిధ వేవ్‌లెంత్‌ల వద్ద కెమెరాను ఆపరేట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








