Home
News

నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్! రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్ తో వస్తోంది! 

By Maheswara

గతంలో, ప్రతి స్మార్ట్‌ఫోన్ కి బ్యాటరీని తీయడానికి అవకాశం ఉండేది, మరియు ఇవి 3.5mm హెడ్‌ఫోన్‌ల సెటప్ తో వచ్చేవి. ఈ 3.5mm హెడ్‌ఫోన్‌ల సెటప్ ఇప్పటికీ చాలా బడ్జెట్ ఫోన్‌లలో కనిపిస్తున్నప్పటికీ, తీయడానికి అవకాశం బ్యాటరీ తో వచ్చే స్మార్ట్ ఫోన్‌ లు ఇప్పుడు మార్కెట్లోకి రావడం లేదు.

ఇలాంటి సమయంలో తొలగించగల బ్యాటరీని కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ చేయాలనీ నోకియా ఆలోచిస్తోంది. ఎంట్రీ-లెవల్ ఫీచర్లతో మరియు తక్కువ ధరలో ఈ కొత్త నోకియా ఫోన్ Nokia C02 ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

Nokia Announced Nokia C02 Smartphone With Removable Battery And Entry Level Specifications.

నోకియా మొబైల్ తన తాజా ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా సరసమైన నోకియా C02ని ఎటువంటి ఆర్భాటం లేకుండా లాంచ్ చేసింది. ఇది FWVGA+ రిజల్యూషన్ మరియు 18:9 యాస్పెక్ట్ రేషియోతో 5.45-అంగుళాల LCD స్క్రీన్ ని అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లేలో పెద్ద మందపాటి బెజెల్‌లను కలిగి ఉంది, అది మనల్ని పాత కాలానికి తీసుకువెళుతుంది. అలాగే గతంలో ఉన్న ఫోన్ల డిజైన్ కలిగి ఉంటుంది. ఇది పాలికార్బోనేట్ ఫ్రేమ్ మరియు నానో-టెక్చర్‌తో వెనుక భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్లో IP52 వాటర్‌ఫ్రూఫింగ్ ఫీచర్ కూడా ఉంది.

ఇక కెమెరా విభాగంలో ఫీచర్లను గమనిస్తే, 2 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు వెనుకవైపు ఒక LED ఫ్లాష్‌తో 5 MP కెమెరా ఉన్నాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3,000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ బ్యాటరీ, ఈ ఫోన్‌కి పూర్తి రోజు శక్తిని అందించడానికి సరిపోతుంది అని సంస్థ చెప్పింది. ఇంకా దీని ప్రత్యేకంతా చెప్పినట్లుగా, ఈ బ్యాటరీ ని తీసి వేయవచ్చు, కాబట్టి బ్యాటరీ పనిచేయకపోయినా మీరు ఎల్లప్పుడూ మరొక కొత్త బ్యాటరీ ని మార్చుకోవచ్చు.

Nokia Announced Nokia C02 Smartphone With Removable Battery And Entry Level Specifications.

ఇంకా ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను గమనిస్తే, ఈ నోకియా ఫోన్ Nokia C02 ,1.4GHz క్లాక్ స్పీడ్‌తో పేరులేని క్వాడ్-కోర్ SoC ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఈ ప్రాసెసర్ 2GB RAM మరియు 32GB eMMC 5.1 స్టోరేజీ తో జత చేయబడింది. ఇక ఈ ఫోన్ యొక్క సాఫ్ట్ వేర్ విషయానికి వస్తే, ముందు, హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్)తో పనిచేస్తుంది. అలాగే, ఈ బ్రాండ్ రెండు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్డేట్ లను కూడా అందిస్తోంది.

Nokia Announced Nokia C02 Smartphone With Removable Battery And Entry Level Specifications.

ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్‌లు మరియు మైక్రో SD కార్డ్ స్లాట్‌తో వస్తుంది. మైక్రో USB కనెక్టర్ సహాయంతో హ్యాండ్‌సెట్ ఛార్జ్ అవుతుంది. ప్రస్తుతం, Nokia C02 ధర మరియు లభ్యత వివరాలు తెలియదు. త్వరలోనే ఈ బ్రాండ్ ప్రకటించాలి. ఈ ఫోన్ ధర $80 లోపు ఉంటుందని అంచనాలున్నాయి.

నోకియా కంపెనీ తన కొత్త నోకియా X30 5G స్మార్ట్ ఫోన్‌ను గత వారం భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుతం, ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు ఫిబ్రవరి 20 మొదటి సేల్‌ను ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ నోకియా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia Announced Nokia C02 Smartphone With Removable Battery And Entry Level Specifications.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X