Home
News

ధర రూ.7,499కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ నోకియా స్మార్ట్‌ఫోన్‌.. సేల్‌ వివరాలు..!

HMD గ్లోబల్‌ సంస్థ గత సంవత్సరం మే నెలలో నోకియా C32 స్మార్ట్‌ ఫోన్‌ను ( Nokia C32 Smartphone ) లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌ సెట్‌ ఆక్టా కోర్‌ Unisoc C32 చిప్‌ సెట్‌ సహా HD+ డిస్‌ప్లే 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌ ద్వారా 3 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని సంస్థ చెబుతోంది.

ధర రూ.1,500 తగ్గింపు : నోకియా C32 స్మార్ట్‌ ఫోన్‌ను ( Nokia C32 Smartphone Price Drop 2024 ) రూ.8,999 ధరకు లాంచ్‌ అయింది. తాజాగా ఈ హ్యాండ్‌ సెట్‌ ధర రూ.1,500 చొప్పున తగ్గించింది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.7,499 కే కొనుగోలు చేయవచ్చు. ఈ నోకియా హ్యాండ్‌సెట్‌ను ఛార్‌కోల్‌, బ్రీజీ మింట్‌, బీచ్‌ పింక్‌ రంగుల్లో లభిస్తుంది.

Nokia C32 Smartphone gets price cut

6.5 అంగుళాల డిస్‌ప్లే, IP52 రేటింగ్‌ : నోకియా C32 స్మార్ట్‌ ఫోన్‌ 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. 720*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే రక్షణకు ప్రత్యేక గ్లాస్‌ను అమర్చారు. దీంతోపాటు IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ ను కలిగి ఉంటుంది.

256GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు : ఈ నోకియా C32 స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డుతో 256GB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత OSను కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను పొందవచ్చనని సంస్థ వెల్లడించింది.

Nokia C32 Smartphone gets price cut

50MP ప్రధాన కెమెరా సహా : కెమెరాల విషయానికి వస్తే.. ఈ నోకియా ఫోన్ వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రధాన కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ స్మార్ట్‌ ఫోన్‌కు 8MP కెమెరాను అమర్చారు. దీంతోపాటు సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

10W ఛార్జింగ్‌, 5000mAh బ్యాటరీ సామర్థ్యం : ఈ నోకియా C32 స్మార్ట్‌ ఫోన్‌ 10W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 3 రోజులపాటు బ్యాటరీ బ్యాకప్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్ అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia C32 Smartphone gets price cut in india here are the sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X