నోకియాని ఎవ్వరికీ అమ్మడం లేదు: సిఈవో స్టీఫెన్‌ ఈలాప్‌

Posted By: Staff

నోకియాని ఎవ్వరికీ అమ్మడం లేదు: సిఈవో స్టీఫెన్‌ ఈలాప్‌

హెల్సింకి: నోకియాను విక్రయించనున్నారని వచ్చిన వార్తలను ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ స్టీఫెన్‌ ఈలాప్‌ ఖండించారు. ఈ వార్తలు నిరాధారమైనవని ఆయన అన్నారు. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ రిచర్డ్‌ గ్రీన్‌ కంపెనీకి ఎందుకు దూరంగా ఉన్నారో తనకు తెలియదని, వైద్య సేవల నిమిత్తం సెలవు కోరిన ఆయన స్థానంలో నోకియా రీసెర్చ్‌ సెంటర్‌ హెడ్‌ హెన్రీ టిర్రీ అదనపు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. కాగా, సంస్థ వ్యూహాలు నచ్చకనే చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ దూరమైనారని, దీంతో నోకియాకు మరిన్ని కష్టాలు వచ్చేలా ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇంటెల్‌తో కలిపి మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఫోన్‌ సాఫ్ట్‌వేర్‌కు పోటీగా తయారు చేసిన 'మీగో' ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను వాడుకునే విషయంలో సంస్థతో ఆయనకు విబేధాలు పెరిగాయని తెలుస్తోంది.

నోకియా డ్యూయెల్‌ సిమ్‌ ఫోన్లను ఎపి మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని పూర్తిగా భారత్‌లో తయారు చేశామని, నోకియా సి2-00, నోకియా ఎక్స్‌1-01 ఫోన్లు అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకుంటాయని భావిస్తున్నామని సంస్థ రీజనల్‌ జనరల్‌ మేనేజర్‌ టిఎస్‌ సుధీర్‌ వ్యాఖ్యానించారు. ఈ ఫోన్లలో నోకియా మనీ అప్లికేషన్‌ను ముందుగానే లోడ్‌ చేసి ఉంచామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులోని ఎంట్రీ లెవల్‌ డ్యూయెల్‌ సిమ్‌ మొబైల్‌ ఫోన్లతో పోలిస్తే ఎన్నో విశిష్ఠతలు వీటిల్లో ఉన్నాయని తెలిపారు. 32 గిగాబైట్ల వరకూ ఎక్స్‌పాండబుల్‌ మెమొరీ సామర్థ్యమున్న సి2-00 ధర 2,500 రూపాయలుగా, 16 జిబి వరకూ పెంచుకోతగ్గ మెమొరీ ఉన్న ఎక్స్‌1-01 ధర 1,950 రూపాయలని వివరించారు. వీటిని చెన్నైలోని ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు తెలిపారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting