60 సంవత్సరాలలో మొదటిసారి, నోకియా లోగో మార్పు! ఎందుకు? వివరాలు
2023 MWC (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్) లో నోకియా తన కొత్త లోగో ని లాంచ్ చేసింది. నోకియా దాదాపు గత 60 సంవత్సరాలలో తమ లోగో ను మొదటిసారిగా మార్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు తన B2Bపై దృష్టి సారించే కొత్త వ్యూహాన్ని ప్రకటించినందున ఈ కొత్త మార్పు ను సూచించే విధంగా ఈ కొత్త లోగో లాంచ్ అయింది.
నోకియా యొక్క నీలిరంగు లోగో మరియు టైప్‌ఫేస్ ఆధునికంగా కనిపించే డిజైన్‌కు అనుకూలంగా తొలగించబడ్డాయి. ఈ కొత్త లోగో యొక్క వాడుక సందర్భాన్ని బట్టి, విభిన్న నేపథ్య రంగులను కలిగి ఉంటుంది. రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నోకియా సీఈఓ పెక్కా లండ్‌మార్క్ మాట్లాడుతూ "స్మార్ట్‌ఫోన్‌లకు అనుబంధం ఉంది మరియు ఈ రోజుల్లో మేము వ్యాపార సాంకేతిక సంస్థగా ఉన్నాము" అని అన్నారు.

నోకియా యొక్క కొత్త వ్యూహం
లుండ్‌మార్క్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో, "మేము మా వ్యూహాన్ని అప్‌డేట్ చేస్తున్నాము మరియు ఈ రోజు మా వ్యూహాన్ని ప్రతిబింబించేలా మేము మా బ్రాండ్‌ను కూడా రిఫ్రెష్ చేస్తున్నాము: నెట్‌వర్క్‌లు క్లౌడ్‌ను కలిసే భవిష్యత్తుకు మార్గదర్శకత్వం వహించే బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ లీడర్.."లా ఉండబోతున్నట్లు పేర్కొన్నారు.
స్థిరమైన మరియు లాభదాయకమైన వృద్ధిపై దృష్టి సారించే బ్రాండ్ యొక్క ప్రస్తుత గుర్తింపును ఈ కొత్త లోగో ప్రతిబింబిస్తుందని నోకియా CEO పేర్కొన్నారు. లుండ్‌మార్క్ మొదట నోకియా కోసం 1990 నుండి 2000 వరకు పనిచేశాడు. తర్వాత అతను సుదీర్ఘ కాలం 20 సంవత్సరాల విరామం తీసుకున్నాడు.ప్రస్తుతం, తడబడుతున్న కంపెనీని పునరుద్ధరించడానికి మరియు తిరిగి అభివృద్ధిలోకి తీసుకురావడానికి 2020లో తిరిగి కంపెనీలో చేరాడు.
ఇప్పుడు , నోకియా చీఫ్ మూడు దశలలో కలిగి ఉన్న కొత్త వ్యూహాన్ని అనుసరించారు. రీసెట్, స్కేల్ మరియు యాక్సిలరేట్. రీసెట్ దశ పూర్తయిందని, ఇప్పుడు కంపెనీ స్కేల్ దశకు సిద్ధమవుతోందని లండ్‌మార్క్ ప్రకటించారు. కంపెనీ తమ కస్టమర్ బేస్‌ను విస్తరింపజేసేటప్పుడు "బలమైన వృద్ధిని మరియు స్థిరమైన లాభదాయకతను అందించడం"పై బ్రాండ్ ప్రస్తుతం ప్లాన్ చేస్తుంది.

నోకియా టెలికాం ఇతర కంపెనీలకు పరికరాలను అమ్మడం కొనసాగిస్తుండగా, బ్రాండ్ తన దృష్టిని ఇతర వ్యాపారాలపై కూడా మార్చాలని భావిస్తోంది. "నెట్‌వర్క్‌లు మరియు పారిశ్రామిక డిజిటలైజేషన్‌పై ఎక్కువగా దృష్టి సారించే కొత్త వ్యూహం తో ఈ బ్రాండ్‌ను మేము ప్రారంభించాలనుకుంటున్నాము, ఇది లెగసీ మొబైల్ ఫోన్‌ల నుండి పూర్తిగా భిన్నమైన విషయం" అని లుండ్‌మార్క్ బ్లూమ్‌బెర్గ్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రకటించారు.
అయితే, ఐకానిక్ పాత నోకియా లోగో శాశ్వతంగా పోయినట్లేనా?
నోకియా రీబ్రాండ్ కు తగినట్లుగా సమకాలీనంగా కనిపించే లోగోను పరిచయం చేస్తున్నప్పటికీ, కంపెనీ యొక్క క్లాసిక్ బ్లూ లోగోను పూర్తిగా తీసివేయాలేదు. 2016లో, HMD గ్లోబల్ నోకియా ట్రేడ్‌మార్క్‌ని ఉపయోగించడానికి లైసెన్స్‌ని పొందింది. ఇది అన్ని నోకియా బ్రాండెడ్ టాబ్లెట్‌లు మరియు మొబైల్ ఫోన్‌లకు "ఏకైక గ్లోబల్ లైసెన్స్"గా మారింది.
Nokiamob నివేదిక ప్రకారం, బ్లూ లోగో మారదు అని HMD గ్లోబల్ ధృవీకరించింది. "నోకియా ఫోన్‌లకు నిలయమైన హెచ్‌ఎండీ గ్లోబల్ క్లాసిక్ నోకియా లోగోను ఉపయోగించడం కొనసాగిస్తుంది" అని కంపెనీ తెలిపింది. బ్రాండ్ క్లాసిక్ నోకియా లోగోతో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే ఉంది, నోకియా G22 ఫోన్ లను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications