నోకియా కొత్త డిజైన్ ' టచ్‌ అండ్‌ టైఫ్'... డిటేల్స్

Posted By: Staff

నోకియా కొత్త డిజైన్ ' టచ్‌ అండ్‌ టైఫ్'...  డిటేల్స్

మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్‌ను పరిచయం చేస్తూ నోకియా ఇండియా టచ్‌ అండ్‌ టైప్‌ డిజైన్‌ను ప్రకటించింది. తమ స్టైలిష్‌ ఫోన్లయిన నోకియా ఎక్స్‌3- 02,నోకియా సి3-01 లతో ఈ డిజైన్‌ అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు ఈ టచ్‌ అండ్‌ టైప్‌ ఆఫర్‌తో టచ్‌ స్క్రీన్‌ ఇంటర్‌ ఫేస్‌తో పాటు కీప్యాడ్‌ ఫంక్షనాలిటీని కూడా అందిస్తోంది.

ఈ సందర్భంగా నోకియా ఇండియా మీడియా, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌, యాక్టివేషన్‌ హెడ్‌ విరల్‌ ఒజా మాట్లాడుతూ ప్రతి ఆవిష్కరణతోనూ వినియోగదారులకు మరిన్ని అదనపు విలువలు అందించడంలో నోకియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ టచ్‌ అండ్‌ టప్‌ డిజైన్‌తో వినియోగదారుల వేలి కదలిక మీద ప్రపంచాన్ని ఆవిష్క రించే అవకాశాన్నిస్తోంది. రెండు కొత్త నోకియా ఎక్స్‌3-02, నోకియా సి3-01 డివైజ్‌లూ వేగం, ఫ్రీక్వెంట్‌ ఇన్‌పుట్‌ అవసరమైన చోట ఎస్సె మ్మెస్‌కూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌కూ అనువుగా డిజైన్‌ కాబడ్డాయి. టచ్‌ సామర్ధ్యంతో పాటు స్మూత్‌ బ్రౌజింగ్‌, మ్యూజిక్‌, గేమ్స్‌ వంటి అప్లికేషన్లు కంట్రోలింగ్‌కు సరైనవి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot