నోకియా G21, 105 & 105 ప్లస్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు విడుదలయ్యాయి!! ఫీచర్స్ బ్రహ్మాండం...

|

HMD గ్లోబల్ భారతదేశంలో ఈరోజు నోకియా G సిరీస్‌లో సరికొత్త మోడల్ నోకియా G21ను గత సంవత్సరం విడుదలయ్యి విజయవంతమైన నోకియా G20 యొక్క అప్ గ్రేడ్ గా విడుదల చేసింది. నేటి లాంచ్ లో నోకియా G21 తో పాటుగా నోకియా 105 మరియు నోకియా 105 ప్లస్ ఫీచర్ ఫోన్‌లు ఉన్నాయి. దీనితో పాటు సంస్థ నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ మరియు నోకియా గో ఇయర్‌బడ్స్ + TWS ఇయర్‌బడ్స్‌ను కూడా లాంచ్ చేసింది. ఈ నోకియా కొత్త ఫోన్ ఒకే ఛార్జ్‌పై మూడు రోజుల బ్యాటరీ లైఫ్ ని అందించడంతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా, వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే నాచ్‌ వంటి ఫీచర్‌లతో రూపొందించబడింది. అలాగే ఇది రెండు సంవత్సరాల OS అప్‌గ్రేడ్‌లు మరియు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుందని ప్రకటించింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

భారతదేశంలో నోకియా G21 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో 4GB RAM + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.12,999 కాగా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.14,999 ధర వద్ద డస్క్ మరియు నార్డిక్ బ్లూ కలర్ లలో లభిస్తుంది. ఇది Nokia.com సైట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లు మరియు కీలకమైన ఈ-కామర్స్ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

నోకియా 105 & 105 ప్లస్ మరియు నోకియా ఇయర్‌బడ్స్ ధరల వివరాలు

నోకియా 105 & 105 ప్లస్ మరియు నోకియా ఇయర్‌బడ్స్ ధరల వివరాలు

నోకియా సంస్థ నేడు విడుదల చేసిన ఫీచర్ ఫోన్‌ల విషయానికి వస్తే నోకియా 105 ప్లస్ ఫోన్ రూ.1,399 ధర వద్ద అందుబాటులో ఉండగా మరోవైపు నోకియా 105 ఫోన్ రూ.1,299 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అలాగే నోకియా బ్రాండ్ యొక్క TWS ఇయర్‌బడ్స్ విషయానికొస్తే, నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ రూ 2,799 ధర వద్ద లభిస్తుండగా, నోకియా గో ఇయర్‌బడ్స్+ రూ.1,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది పాలికార్బోనేట్ బాడీని కలిగి ఉండి 6.5-అంగుళాల ఫ్లూయిడ్ స్క్రీన్ డిస్‌ప్లేను 1600×720 రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తాయి. ఇది Unisoc T606 ప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతూ రెండు సంవత్సరాల OS అప్ డేట్ లను మరియు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్లను అందిస్తుంది.

ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌

నోకియా G21 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ సెటప్, 2MP మాక్రో సెన్సార్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, FM రేడియో, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరిగా ఇది 5,050mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఒక ఛార్జ్ పై మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ మరియు నోకియా గో ఇయర్‌బడ్స్+ స్పెసిఫికేషన్స్

నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్ మరియు నోకియా గో ఇయర్‌బడ్స్+ స్పెసిఫికేషన్స్

నోకియా కంఫర్ట్ TWS ఇయర్‌బడ్‌లు గరిష్టంగా 29 గంటల ప్లేటైమ్‌ను అందిస్తాయి. ఇది IPX5 నీరు మరియు చెమట రెసిస్టెంట్ కోటింగ్‌తో వస్తుంది. మరోవైపు నోకియా గో ఇయర్‌బడ్స్+ 26 గంటల వరకు ప్లే టైమ్‌ని అందిస్తోంది. ఇది థంపింగ్ బాస్ సౌండ్ కోసం 13mm డ్రైవర్లను కలిగి ఉంది. ఇది IPX4 చెమట మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ కోటింగ్‌తో కూడా వస్తుంది. ఈ రెండు TWS ఇయర్‌బడ్‌లు బ్లాక్ మరియు వైట్ కలర్ వేరియంట్‌లలో వస్తాయి.

Best Mobiles in India

English summary
Nokia G21 Smartphone Launched in India With Triple Rear Camera Setup: Price, Specs, Sales Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X