Home
News

Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా - HMD గ్లోబల్‌ భాగస్వామ్యంతో గత నెలలో Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. విడుదల సమయంలో 6GB ర్యామ్‌, 128GB అంతర్గత స్టోరేజీలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు వచ్చిన ఆదరణతో తాజాగా 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీ వేరియంట్‌ను విడుదల చేసింది.

దీంతోపాటు మరో కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ కొత్త వేరియంట్‌ ర్యామ్‌ను 16GB వరకు వర్చువల్‌గా పెంచుకొనే అవకాశం ఉందని వెల్లడించింది. 20000 రూపాయల్లోపు 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు.. ఈ నోకియా ఫోన్‌ను ప్రయత్నం చేయవచ్చు.

Nokia G42 5G New variant launched

Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌+ 256GB అంతర్గత స్టోరేజీ ధర రూ.16,999గా ఉంది. ఈ ఫోన్‌ పింక్‌, గ్రే, పర్పల్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో లభిస్తుంది. లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.999 విలువైన బ్లూటూత్‌ హెడ్‌సెట్‌ ఉచితంగా పొందనున్నారు.

నోకియా G42 స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 560 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ బరువు 193.8g మరియు 8.5mm థిక్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 480+ CPU మరియు అడెన్నో 619 GPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 13పై పనిచేస్తుంది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 20W ఛార్జర్‌తో వస్తుంది. కెమెరా విభాగానికి సంబంధించి ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP +2MP +2MP కెమెరాలను కలిగి ఉంటుంది. అదే ముందువైపు 8MP కెమెరాను అమర్చారు.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌ IP52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. వైఫై, బ్లూటూత్‌ 5.1, హెడ్‌ఫోన్‌ జాక్‌, భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ రీడర్‌ను కలిగి ఉంటుంది. నోకియా అధికారిక వెబ్‌సైట్‌ సహా ఇతర రిటైల్‌ దుకాణాల్లో ఈ ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉందని సంస్థ వెల్లడించింది.

*నోకియా నుంచి ఇటీవలే G42 5G స్మార్ట్‌ఫోన్‌తోపాటు C32 ఫోన్‌ కూడా విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ ధర రూ.10,499గా ఉంది. నోకియా C32 స్మార్ట్‌ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. చార్‌కోల్‌, బ్రీజి మింట్‌, బీచ్‌ పింక్‌ రంగులో కొనుగోలు చేయవచ్చు. నోకియా అధికారిక వెబ్‌సైట్‌, రిటైల్‌ అవుట్‌లెట్‌, ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia G42 5G 8GB RAM and 256GB internal storage variant launched
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X