50MP కెమెరా, 11GB వరకు RAM తో Nokia 5G ఫోన్, ఇపుడు రూ.రూ.9749 కే కొనండి! సేల్ వివరాలు
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఇప్పుడు భారీ తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. 11GB వరకు RAM తో ముఖ్యంగా 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లు మరియు ప్రత్యేక ఫీచర్ల వివరాలు చూద్దాం.
11GB వరకు RAM మరియు 128GB స్టోరేజ్ కలిగిన నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ఇప్పుడు 30 శాతం తగ్గింపు ఆఫర్ తో ధర రూ. 11,499 కి సేల్ చేయబడుతోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1750 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.9749 కి కొనుగోలు చేయవచ్చు.

Nokia G42 5G స్పెసిఫికేషన్ల వివరాలు:
Nokia G42 5G ఫోన్ 6.56 అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. ఫోన్‌లో 720 x 1,612 పిక్సెల్‌లు, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 560 నిట్స్ బ్రైట్‌నెస్ మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ వంటి వివిధ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.
నోకియా G42 5G ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. అయితే ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ ఇటీవలే అందుబాటులో ఉండటం గమనార్హం.
అలాగే, ఈ Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌లో గేమింగ్ వినియోగదారులను ఆకర్షించడానికి Adreno 619 GPU గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. కాబట్టి గేమింగ్ యూజర్లు ఈ ఫోన్ ను నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు. HMD గ్లోబల్ ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ మరియు డిజైన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది.
ఈ Nokia G42 5G మోడల్ 11GB వరకు RAM (6GB RAM + 5GB వర్చువల్ RAM) + 128GB స్టోరేజీ ని కలిగి ఉంది. అదనంగా, ఈ ఫోన్ స్టోరేజీ విస్తరణకు SD కార్డు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్‌లో మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించుకునేలా మైక్రోఎస్డీ కార్డ్ సదుపాయం ఉండటం గమనార్హం.
నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో కెమెరా + 2MP డెప్త్ కెమెరా. సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే, ఈ ఫోన్ కెమెరా నైట్ మోడ్ 2.0, AI పోర్ట్రెయిట్, OZO 3D ఆడియో క్యాప్చర్‌ను సపోర్ట్ చేస్తుంది.
ముఖ్యంగా ఈ ఫోన్‌లో IP52 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఫోన్‌లో బ్లూటూత్ 5.1, వై-ఫై 802, GPS మరియు టైప్-సి 2.0 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. అన్ని గొప్ప ఫీచర్లతో, ఈ ఫోన్ తక్కువ ధరతో వస్తుంది కాబట్టి మీరు దీన్ని నమ్మకంగా కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications







