నోకియాకు 3వ ర్యాంక్... తాజా సర్వేలో వెల్లడి!

Posted By: Super

నోకియాకు 3వ ర్యాంక్... తాజా సర్వేలో వెల్లడి!

 

 

అంతర్జాతీయ మొబైల్ తయారీ సంస్థ నోకియాకు.. ఇండియాలో 3వ అత్యంత నమ్మదగిన బ్రాండ్‌గా గుర్తింపు లభించింది. ఈ ఏడాదికిగాను నిర్వహించిన

ది ఎకనమిక్ టైమ్స్ - బ్రాండ్ క్వాలిటీ యాన్యువల్  'మోస్ట్ ట్రస్డడ్ బ్రాండ్స్ ' సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. టెక్నాలజీ విభాగంలో నోకియా నెం.1 స్థానాన్ని దక్కించుకున్నట్లు సర్వే స్పష్టంచేసింది. 15-25 వయస్సు మధ్యగల యువత విశ్వసించే బ్రాండ్‌లలో నోకియాకు 2వ స్థానం లభించినట్లు సర్వే తన నివేదికలో పేర్కొంది. ఈ సర్వేను నిర్వహించిన నిల్సన్ కంపెనీ మొత్తం 12నగరాల్లో 8160మంది అభిప్రాయాలను సేకరించింది. ఈ గుర్తింపు తమసంస్థ బలోపేతానికి మరింత దోహదపడుతుందని రానున్న సంవత్సరాల్లో బ్రాండ్ విలువను మరింత రెట్టింపు చేస్తామని నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విరాలో ఓజా తెలిపారు. గొత కొన్ని సంవత్సరాలుగా చేపడుతున్న ఈ సర్వేలో నోకియా ర్యాకింగ్స్ ఈ విధంగా ఉన్నాయి.

2005- 71వ ర్యాంక్,

2006- 44వ ర్యాంక్,

2007- 4వ ర్యాంక్,

2008,2009, 2010 - 1వ ర్యాంక్,

2011- 5వ ర్యాంక్,

2012(తాజా)- 3వ ర్యాంక్.

ఇంటర్నెట్‌ ఫీచర్‌తో అదుర్స్ అనిపించే నోకియా ఫోన్ రూ.2,257కే!

పేస్‌బుక్ ఇంకా ట్విట్లర్ ఆప్షన్‌లతో కూడిన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ ‘నోకియా 109’ను నోకియా ఆవిష్కరించింది. ధర రూ.2,257. సిరీస్ 40 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. 2జీ ఇంటర్నట్ కనెక్టువిటీతో పాటు అనేక సరికొత్త ఫీచర్లు ఈ ఫోన్‌లో ఒదగి ఉన్నాయి.

నోకియా 109 పూర్తి స్పెసిఫికేషన్‌లు……

బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ బరువు 77 గ్రాములు, చుట్టుకొలత 110 x 46 x 14.8మిల్లీ మీటర్లు,

డిస్‌ప్లే: 1.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 128 x 160పిక్సల్స్,

స్టోరేజ్: 16ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

ఇంటర్ ఫేస్: నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,

కనెక్టువిటీ: జీపీఆర్ఎస్/ఎడ్జ్ ఇంకా 2జీ ఇంటర్నెట్ కనెక్టువిటీ,

బ్యాటరీ: 800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్‌టైమ్ 7.5 గంటలు, స్టాండ్‌బై 790 గంటలు).

అదనపు ఫీచర్లు:

నోకియా ఎక్ప్‌ప్రెస్ బ్రౌజర్,

ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్,

ఈ-బడ్డీ ఇన్సస్టెంట్ మెసెంజర్.

ధర ఇతర వివరాలు:

సియాన్ ఇంకా బ్లాక్ వేరియంట్‌లలో డిజైన్ కాబడిన నోకియా 109…… చైనా, ఆసియా పసిఫిక్ ఇంకా యూరోప్ ప్రాంతాల్లో ఈ ఏడాది చివరి నుంచి అందుబాటులోకి రానుందిచ ధర $42 (రూ.2,250).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot