జియోఫోన్‌కు పోటీగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్

Posted By: BOMMU SIVANJANEYULU

రిలయన్స్ జియో లాంచ్ చేసిన కారుచౌక 4జీ ఫీచర్ ఫోన్ 'JioPhone’ దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతోంది. ఈ ఫోన్ లాంచ్ అయిన తరువాత మార్కెట్లో మరింత పోటీ వాతావరణం నెలకుంది. జియోఫోన్‌కు పోటీగా చాలా కంపెనీలు 4జీ ఫీచర్ ఫోన్‌‌లను మార్కెట్లో లాంచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి.

జియోఫోన్‌కు పోటీగా నోకియా 4జీ ఫీచర్ ఫోన్

మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా వంటి కంపెనీటు బీఎస్ఎన్ఎల్ వంటి నెట్‌వర్క్ ఆపరేటర్ల భాగస్వామ్యంతో 4జీ ఫీచర్ ఫోన్‌‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోన్నాయి. మరోవైపు ఎయిర్‌టెల్, ఐడియా వంటి లీడింగ్ టెల్కోలు కూడా 4జీ ఫీచర్ ఫోన్ మార్కెట్ పై దృష్టిసారిస్తున్నాయి. రూ.2000 ధర ట్యాగ్‌తో ఎయిర్‌టెల్ అభివృద్ధి చేస్తోన్న 4జీ ఫీచర్ ఫోన్ కూడా త్వరలోనే మార్కెట్లో లాంచ్ కాబోతోంది.

తాజాగా Economic Times రివీల్ చేసిన వివరాల ప్రకారం హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా కూడా 4జీ నెట్‌వర్క్ ఆధారిత ఫీచర్ పోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జియోఫోన్‌కు రైవల్‌గా భావిస్తోన్న ఈ ఫీచర్ ఫోన్ గురించి హెచ్ఎండి గ్లోబల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అజయ్ మెహతా చూచాయిగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నోకియా బ్రాండ్‌కు సంబందించి నాలుగు ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లభ్యమవతున్నాయి వీటిలో నోకియా 3310 కూడా ఒకటి. నోకియా 4జీ ఫీచర్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ మార్కెట్ రిసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. 2017 చివరి నాటికి 2.5 కోట్ల 4జీ ఫీచర్ ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చే అవకావముందట. రిలయన్స్ జియో తన ట్రెండ్‌సెట్టర్ JioPhoneకు సంబంధించి మొదటి బ్యాచ్ క్రింద 60 లక్షల ఫోన్‌లను మార్కెట్లో డెలివరీ చేయబోతోంది. ఇదే క్రమంలో ఇతర మొబైల్ బ్రాండ్‌లు కూడా భారీ సంఖ్యలో 4జీ ఫీచర్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఫ్లాష్ మెసేజ్‌లు విసిగిస్తున్నాయా, అయితే ఇలా తీసి పడేయండి

మార్కెట్లో జియో‌ఫోన్‌ అనౌన్స్ అయిన మరుక్షణం నుంచి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ మార్కెట్ పై గట్టి పట్టున్న మైక్రోమాక్స్, ఇంటెక్స్, లావా, కార్బన్, సామ్‌సంగ్ వంటి కంపెనీలు తమ భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

కేవలం, రూ.1500 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌తో జియో ఈ ఫోన్‌లను సప్లై చేయబోతున్న నేపథ్యంలో మిగలిన ఫీచర్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా సరిగ్గా ఇలాంటి ఆఫర్లనే మార్కెట్లో లాంచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇలా చేయని పక్షంలో భారీ నష్టాలు మూటగట్టుకోక తప్పదు.

మైక్రోమాక్స్, లావా, ఇంటెక్స్ వంటి కంపెనీలు ఇప్పటికే బేసిక్ ఫీచర్లతో కూడిన 4జీ ఫీచర్ ఫోన్‌లను అభివృద్ధి చేస్తున్నాయి. జియో ఫోన్‌లతో ఇవి పోటీ పడాలంటే ఇతర టెలికం ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకోక తప్పదు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తోన్న రిలయన్స్ జియోఫోన్ ఒకే దెబ్బతో ఫీచర్ ఫోన్‌ల స్వరూపాన్నే మార్చేసింది.

50 శాతం మార్కెట్ వాటాతో ఫీచర్ ఫోన్‌లు ఇండియన్ మార్కెట్‌ను శాసిస్తోన్న నేపథ్యంలో, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లాంచ్ చేసిన జియో స్మార్ట్ ఫీచర్ ఫోన్ మార్కెట్‌ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నట్లయ్యింది. 4జీ VoLTE కనెక్టువిటీకి తోడు స్మార్ట్‌ఫోన్ తరహా ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న జియోఫోన్‌ ఉచితంగా దొరుకుతుందంటే ఎవరు వద్దంటారు చెప్పండి.

Read more about:
English summary
Nokia might soon enter the 4G feature phone market to launch a rival to the JioPhone. Read more...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot