సంవత్సరం చివర కల్లా మార్కెట్‌లోకి నోకియా విండోస్ ఫోన్స్

Posted By: Super

సంవత్సరం చివర కల్లా మార్కెట్‌లోకి నోకియా విండోస్ ఫోన్స్

తైవాన్: భారతదేశంలో మొబైల్స్ ఉత్పత్తులలో నెంబర్ వన్ స్దానంలో ఉన్నటువంటి నోకియా త్వరలో స్మార్ట్ పోన్‌ని అంటే మైక్రోసాప్ట్ విండోస్ పోన్ 7ని ఈ సంవత్సరం చివరలో మార్కెట్‌‌లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ నిపుణులు వెల్లడించారు. తైవాన్ కమర్షియల్ టైమ్స్ ప్రకారం తైవనీస్ హ్యాండ్ సెట్ కాంట్రాక్ట్ తయారీదారు అయిన కంపాల్ కమ్యానికేషన్స్ నోకియా కంపెనీ విండోస్ ఫోన్స్ ఆర్డర్స్ వచ్చిన్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్స్ తయారుచేయడాన్ని నాల్గవ క్వార్టర్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నోకియా ప్లాన్ ప్రాకరం రెండు స్మార్ట్ ఫోన్స్‌‌ని తయారు చేయనున్నట్లు తెలుస్తుంది. మొదటిది పుల్ టచ్ స్క్రీన్ మొబైల్ కాగా, రెండవది కీబోర్డ్‌ ఉండి స్లీక్ మోడల్‌గా ఉంటుందన్నారు. ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి మొబైల్ తయారీ సంస్ద నోకియా ఫిబ్రవరిలో మైక్రోసాప్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సాప్ట్‌‌వేర్ నోకియా స్మార్ట్ ఫోన్స్‌కు వాడుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot