త్వరలో దేశవ్యాప్తంగా నోకియా ‘మొబైల్ మనీ’ సేవలు!

Posted By: Staff

త్వరలో దేశవ్యాప్తంగా నోకియా ‘మొబైల్ మనీ’ సేవలు!

మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా ఈ ఏడాది ‘మొబైల్ మనీ’ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే కంపెనీ ఢిల్లీ, ముంబై, పుణే, చండీగఢ్, చెన్నై నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం కంపెనీ యస్ బ్యాంక్, యూనియన్ బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నగదు బదిలీ, బిల్లుల చెల్లింపులు సెల్‌ఫోన్ ద్వారా జరపడమే మొబైల్ మనీ ప్రత్యేకత. సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా కస్టమర్‌కు ఒక ఖాతా(ఈ- వాలెట్)ను తెరుస్తారు.

ఈ ఖాతా నుంచే ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లింపులను చేయవచ్చు. యస్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఏజెంట్లు, నోకియా రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా ఈ-వాలెట్‌లో రూ.50 వేల వరకు నగదును జమ చేయించుకోవచ్చు. మొబైల్ మనీ సేవలపై భారీ అంచనాలు ఉన్నాయని, త్వరలోనే ఇవి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయని మొబైల్ ఫోన్స్ సొల్యూషన్స్, మార్కెటింగ్ హెడ్ కౌస్తవ్ చటర్జీ మీడియాకిక్కడ చెప్పారు.

నోకియా రాష్ట్ర మార్కెట్లోకి గురువారం డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై విభాగంలో ఇంటర్నెట్ ఫోన్ సీ2-00తోపాటు ఎక్స్1-01 మ్యూజిక్ ఫోన్‌ను విడుదల చేసింది. వీటిని చెన్నై ప్లాంటులో తయారు చేసినట్టు కంపెనీ తెలిపింది. అయిదు సిమ్‌ల సెట్టింగ్స్‌ను ఇవి నిక్షిప్తం చేస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot