నోకియా సీఈఓ రేసులో భారతీయుడు..?

Posted By:

ఫిన్లాండ్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ నోకియా సారథ్య బాధ్యతలను ప్రస్తుతం ఆ కంపెనీ టెలికం పరికరాల వ్యాపార విభాగానికి హెడ్‌గా కొనసాగుతున్న భారతీయ వ్యక్తి రాజీవ్ సూరి త్వరలో స్వీకరించనున్నట్లు ఫిన్లాండ్ మీడియాలో కధనాలు వ్యక్తమవుతున్నాయి.

 నోకియా సీఈఓ రేసులో భారతీయుడు..?

ఈ ఖరారుకు సంబంధించిన ప్రకటన ఈ నెలాఖరులో లేదు ఏప్రిల్‌లో వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం నోకియా కంపెనీ సీఈఓగా స్టీఫెన్ ఇలోప్ కొనసాగుతున్నారు. వచ్చే నెలలోగా నోకియా హ్యాండ్‌సెట్ వ్యాపార కొనుగోలు డీల్‍‌ను మైక్రోసాఫ్ట్ పూర్తి చేసే నాటికి సూరి నియామకం గురించి ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనా.

ఇదిలా ఉండగా, సీఈఓగా సూరి నియామకం విషయం పై స్పందించేందుకు నోకియా యాజమాన్యం నిరాకరించినట్లు సమాచారం. రాజీవ్ సూరి మంగళూరు విశ్వవిద్యాయంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ విభాగంలో బ్యాచిలర్స్ పట్టా అందుకున్నారు. గత నెలలోనే మైక్రోసాఫ్ట సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot