నోకియా రీఎంట్రీ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న HMD గ్లోబల్

మైబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017కు సమయం సమీపిస్తోంది. సరికొత్త మొబైల్ ఆవిష్కరణలతో పండుగ వాతవరణాన్ని తలిపించే ఈ అంతర్జాతీయ మొబైల్ ఎగ్జిబిషన్‌ను స్పెయిన్‌ కాస్మోపాలిటన్ క్యాపిటల్ అయిన బార్సిలోనాలో ఫిబ్రవరి 27నుంచి మార్చి 2వరకు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌‌లో భాగంగా పురస్కరించుకుని తమ తమ కొత్త మొబైల్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు ప్రముఖ బ్రాండ్‌లు పోటీపడుతున్నాయి.

నోకియా రీఎంట్రీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న HMD గ్లోబల్

ఒకప్పుడు దిగ్గజ కంపెనీగా పేరొందిన నోకియా, MWC 2017తో మార్కెట్ రీఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఇందుకు గాను ఫిబ్రవరి 26న ఓ ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌ను కూడా నోకియా ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా నోకియా పీ1, నోకియా 8, నోకియా డీ2సీ, నోకియా 3, నోకియా 3310 వంటి ఫోన్‌లతో పాటు పలు హెల్త్ డివైసెస్, వీఆర్ హెడ్‌సెట్‌లను కూడా లాంచ్ చేసేందుకు HMD గ్లోబల్ సిద్ధంగా ఉన్నట్లు రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

నోకియా రీఎంట్రీని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న HMD గ్లోబల్

ఈ ప్రీ MWC ఈవెంట్‌ను నోకియా లైవ్ స్ట్రీమ్ చేయనుంది. Nokia OZO ద్వారా ఈ కార్యక్రమాన్ని 360 డిగ్రీ అనుభూతులతో వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదే సమయంలో నోకియా యూట్యూబ్ ఛానల్ కూడా ఈ కార్యక్రమాన్ని 3డీ ఫార్మాట్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. నోకియా అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

నోకియా యూట్యూబ్ ఛానల్ లింక్

నోకియా ఫేస్‌బుక్ పేజీ లింక్

English summary
Nokia to live stream MWC event on February 26; Where and how to watch it. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot