జూన్ 27.. ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోంది (వీడియో)?

Posted By: Super

జూన్ 27.. ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోంది (వీడియో)?

నోకియా అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జూన్ 27కు ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది..ఈ రోజును పురస్కరించుకుని ఓ బృహత్తర నవీకరణకు నోకియా సన్నాహాలు పూర్తి చేసింది. బ్రాండ్ రూపొందించిన విండోస్ ఆధారిత స్మార్ట్‌‍ఫోన్‌లు లూమియా 710, లూమియా 800లు బుధవారం టాంగో వోఎస్ అప్‌డేట్‌ను పొందనున్నాయి. ఈ నవీకరణతో లూమియా 710, 800 స్మార్ట్‌ఫోన్‌లలోకి వై-ఫై టిటరింగ్, ఇంటర్నెట్ షేరింగ్ వంటి కొత్త ఫీచర్లు అదనంగా వచ్చి చేరుతాయి. అంతేకాకుండా, ఫోన్‌ల పనితీరు మరింత మెరుగుపడుతుంది. టాంగో అప్‌డేట్‌కు సంబంధించిన వీడియోను క్రింద చూడొచ్చు...

నోకియా లూమియా 610:

పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రూపుదిద్దుకున్న 3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్) , 5 మెగా పిక్సల్ కెమరా (ఆటో ఫోకస్, ఎల్ ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 10), ఎడ్జ్ (క్లాస్ 10), వై-ఫై ( 802.11 b/g/n ), బ్లూటూత్ అదనంగా A2DP కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 256ఎంబీ ర్యామ్, 800 MHz ప్రాసెసర్, 2జీ నెట్ వర్క్ సపోర్ట్, 3జీ నెట్ వర్క్ (HSDPA 850 / 900 / 1900 / 2100 సపోర్ట్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మైక్రోసాఫ్ట్ టాంగో ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ స్టాండ్ బై 530 గంటలు, బరువు 131.5గ్రాములు.

నోకియా లూమియా 800:

* మైక్రోసాఫ్ట్ టాంగో ఆపరేటింగ్ సిస్టం, * 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్, * అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్, * జీపీఆర్ఎస్, ఎడ్జ్ సపోర్ట్, * వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ, * 3జి కనెక్టువిటీ, * 3.7 అంగుళాల మల్టీ టచ్ స్క్రీన్, * గొరిల్లా ప్రొటెక్షన్ గ్లాస్, * ఇంటర్నల్ స్టోరేజి 16జీబి, * 8 మెగా పిక్సల్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, * 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్, * ధర రూ.30,000.

Video:


src="http://www.youtube.com/watch?feature=player_embedded

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot