స్పెషల్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయ్!

Posted By: Prashanth

స్పెషల్ క్వాలిటీస్ చాలానే ఉన్నాయ్!

 

నోకియ అభిమానులను గత కొంత కాలంగా ఉూరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ‘లూమియా 900’ అగష్టులో విడుదల కావొచ్చన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నోకియా ఫోన్‌లలో ఉత్తమమైనదిగా విశ్లేషకుల నుంచి ప్రశంసలనందుకుంటున్న లూమియా 900 ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంది.

లూమియా 900 ప్రత్యక ఫీచర్లు:

నోకియా డ్రైవ్ - వాయిస్ గైడెడ్ జీపీఎస్ నావిగేషన్,

ఈఎస్‌పీఎన్ స్పోర్ట్స్ హబ్ - స్పోర్ట్స్ సంబంధిత అప్లికేషన్‌లు,

ద డార్క్ నైట్ రైసెస్ - తాజాగా విడుదలైన ద డార్క్ నైట్ రైసెస్ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన అప్లికేషన్,

నోకియా ప్లే టూ - ఈ అప్లికేషన్ ఫోన్‌లోని ఫోటలతో పాటు వీడియోలను టీవీ పై డిస్‌ప్లే చేస్తుంది.

లూమియా 900 స్పెసిఫికేషన్‌లు:

4.3 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

8 మెగాపిక్సల్ ప్రైమరీ రేర్ కెమెరా (ఆటోఫోకస్),

1 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,

16జీబి ఇంటర్నెట్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్,

1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

త్వరలో ఐదు స్మార్ట్‌ఫోన్‌లు:

నోకియా మరో ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చెయ్యనుంది. ఈ దిగ్గజ మొబైల్ తయారీ కంపెనీ నుంచి గత నెలలో విడుదలైన ‘ప్యూర్ వ్యూ 808’ మార్కెట్లో హిట్‌టా‌క్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసింది. భవిష్యత్ కార్యచరణలో భాగంగా నోకియా ప్రవేశపెట్టబోతున్న ఐదు స్మార్ట్‌ఫోన్‌ల జాబితా..

బెల్లీ 805,

నోకియా 510,

లూమియా920,

లూమియా 950,

లూమియా 1001.

ఈ వివరాల నోకియా తాజాగా నిర్వహించిన రిమోట్ డివైజ్ యాక్సిస్ (ఆర్ డీఏ) కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి. త్వరలో విడుదల కానున్న నోకియా 510, బెల్లీ 805 ఫోన్‌లు సింబియాన్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతాయి. మిగిలిన మూడు ఫోన్‌లు విండోస్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. మరో మోడల్ లూమియా 1001 విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot