న్యూయార్క్ వెలుగుల మధ్య ‘నోకియా లూమియా 920’!

Posted By: Prashanth

న్యూయార్క్ వెలుగుల మధ్య ‘నోకియా లూమియా 920’!

 

గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని ఊరిస్తున్న నోకియా విండోస్ 8 ఫోన్ ‘లూమియా 920’ను బుధవారం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు హాజరయ్యారు. మైక్రోసాఫ్ట్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ ఫోన్ 8’ ప్రత్యేకతతో రూపుదిద్దుకున్న లూమియా 920 వరస నష్టాలను చవిచూస్తున్న నోకియాకు నూతన ఉత్తేజాన్ని నింపగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

లూమియా 920 కీలక ఫీచర్లు:

విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,

నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీ,

వై-ఫై,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (నోకియా ప్యూర్ వ్యూ టెక్నాలజీ),

1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,

1జీబి ర్యామ్,

32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

మైక్రోయూఎస్బీ పోర్ట్,

శక్తివంతమైన 2,000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

క్యఐ వైర్‌లెస్ పవర్ స్టాండర్డ్.

లూమియా 920 ఎల్లో, రెడ్, వైట్, గ్రే, బ్లా వంటి వైబ్రెండ్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ఫోన్‌కు సంబంధించి పూర్తిస్థాయి స్పెసిఫికేషన్‌లతో పాటు ధర వివరాలు తెలియాల్సి ఉంది. భారత్ మార్కెట్లో లూమియా 920 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting