నోకియా కోసం ప్రత్యేక అప్లికేషన్

Posted By: Staff

నోకియా కోసం ప్రత్యేక అప్లికేషన్

 

నోకియా లూమియీ విండోస్ ఫోన్‌ల కోసం నైబంజ్ (Nimbuzz) సంస్థ ఇన్స్‌స్టెంట్ మేసేజింగ్ అప్లికేషన్‌ను డిజైన్ చేసింది. ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్  చేసుకోవటం ద్వారా లూమియా విండోస్ ఫోన్ యూజర్లు నిరంతరాయంగా వీడియోకాలింగ్ ఇంకా చాటింగ్ నిర్వహించుకోవచ్చు. నైంబజ్ సంస్థ ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి లూమియా విండోస్ ఫోన్‌ల కోసం వృద్ధి చేసింది. విండోస్ ఫోన్ మార్కెట్ ప్లేస్ నుంచి ఈ యూప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఎస్ఎంఎస్ ఆప్షన్‌ను సైతం ఇందులో పొందుపరిరచారు. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో యూజర్ ఫేస్‌బుక్, జీటాక్, యూహూ మెసెంజర్, ఎమ్ఎస్ఎన్ తదితర సామాజిక నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉన్న మిత్రులతో  మాటలు పంచుకోవచ్చు. గురువారం నుంచి ఈ అప్లికేషన్ అధికారికంగా అందుబాటులోకి రానుంది.

ఐఫోన్ 5 కు ముందే నోకియా విండోస్ 8

మొబైల్ ఫోన్‌ల తయారీ రంగంలో విశ్వసనీయ సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న నోకియా స్మార్ట్‌ఫోన్ సంగ్రామాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తోంది. సెప్టంబర్ 5ను హెల్సింకిలో జరగనున్న నోకియా వార్షిక ప్రపంచ కార్యక్రమంలో సరికొత్త విండోస్ 8 ఫోన్‌లను ప్రకటించేందుకు నోకియా సన్నాహాలు పూర్తి చేసినట్లు బ్లూమ్‌బర్డ్ రిపోర్టులు వెల్లడించాయి. సెప్టంబర్ 12న ఆపిల్ ఐఫోన్5 విడుదలవుతున్న నేపధ్యంలో అందుకు వారం రోజులు ముందే నోకియా విండోస్ 8 ఫోన్‌ను ఆవిష్కరించటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ వార్షిక కార్యక్రమంలో భాగంగా నోకియా మరిన్ని మోడళ్లలో విండోస్ 8 ఫోన్‌లను ప్రకటించే అవకాశముందని టెక్ పండితులు జోస్యం చెబుతున్నారు. కాగా, మొట్టమొదటి నోకియా విండోస్ 8 స్మార్ట్‌ఫోన్ నవంబర్ నాటికి అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాల టాక్.

ప్రపంచ వార్సిక కార్యక్రమాన్ని పురస్కరించుకుని నోకియా ప్రకటించే విండోస్ 8 ఫోన్‌ల జాబితా (అంచనా):

నోకియా లూమియా 910,

నోకియా లూమియా 920,

నోకియా లూమియా 1001,

నోకియా లూమియా 950,

నోకియా 510,

నోకియా బెల్లీ 805.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot