రండి బాబూ రండి.. నచ్చితే లవ్.. నచ్చకపోతే బ్రేకప్!

Posted By: Staff


రండి బాబూ రండి.. నచ్చితే లవ్.. నచ్చకపోతే బ్రేకప్!

 

లూమియా సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్ననోకియా వీటి కొనుగోళ్ల పై 7 రోజుల మనీ బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించే యోచనలో ఉంది. ఈ ఆఫర్ నిబంధనలు భారత్ మార్కెట్లో లభ్యమవుతున్న లూమియా 800,700 స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లలో ఏదో ఒక దానిని కొనుగోలు చేసిన వినియోగదారుడు ఉత్పత్తి పై ఏ విధమైన అసంతృప్తికి లోనైనా 7 రోజుల లోపు ఈ వస్తువును కొనుగోలు చేసిన స్టోర్‌లోనే తిరిగిచ్చేసి డబ్బు వాపస్ పొందవచ్చు. ఈ రాయితీని పొందాలనుకునే ఔత్సాహికులు ముందుగా నోకియా ఇండియా ఫేస్‌బుక్‌లోకి లాగినై తమ పూర్తి వివరాలను రిజిస్టర్ చేసుకోవల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌లో ప్రక్రియలో భాగంగా పేరు, మొబైల్ నెంబర్, కొనుగోలు చేసే మోడల్ నెంబర్, ఏ స్టోర్‌లో కొనలానుకుంటున్నారు, అది ఏ ప్రాంతంలో ఉంది వంటి అంశాలను పూరించాల్సి ఉంటుంది.

నోకియా లూమియా 710:

పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రూపుదిద్దుకున్న 3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్) , 5 మెగా పిక్సల్ కెమరా (ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 33), ఎడ్జ్ (క్లాస్ 33), వై-ఫై ( 802.11 b/g/n ), బ్లూటూత్ అదనంగా A2DP కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, ఆడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్, క్వాల్కమ్ SM8255 స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ నెట్‌వర్క్ (HSDPA 900 / 1900 / 2100 and HSDPA 850 / 900 / 1700 / 1900 / 2100 for Canada), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు, బరువు 125.5గ్రాములు. ఇండియన్ మార్కెట్లో నోకియా లూమియా 710 ధర రూ.19,000.

నోకియా లూమియా 800 ఫీచర్లు:

* మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం,

* 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్,

* అడ్రినో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

* జీఎస్ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్,

* జీపీఆర్ఎస్, ఎడ్జ్ సపోర్ట్,

* వై-ఫై ఇంటర్నెట్ కనెక్టువిటీ,

* 3జి కనెక్టువిటీ,

* 3.7 అంగుళాల ఆమోల్డ్ మల్టీ టచ్ స్క్రీన్,

* ఇంటర్నల్ స్టోరేజి 16జీబి,

* ఫ్రీ స్కై డ్రైవ్ స్టోరేజ్ 25జీబి,

* 8 మెగా పిక్సల్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా,

* 720 పిక్సల్ హై డెఫినిషన్ వీడియో రికార్డింగ్,

* ధర రూ.24,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot